— నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
Vemula Viresham : ప్రజా దీవెన, నకిరేకల్ : నకిరేకల్ నియోజకవర్గంలో అర్హులందరికీ ప్రభుత్వ ఫలాలు అందుతాయని ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నా రు. నకిరేకల్ మండలం నడిగూ డెం, ఓగోడు, నోముల గ్రామాలతో పాటు నకిరేకల్ మున్సిపాలిటీలోని 18,17వ వార్డులో మంగళవారం రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు లబ్ధిదారుల ఎంపికపై జరిగిన ప్రజాపాలన సభల్లో ఆయ న పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే ప్రభుత్వం మహి ళలకు ఉచిత బస్ ప్రయాణం, 500కే గ్యాస్ సిలిం డర్, 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్, రైతు రుణమాఫీ వంటి కార్యక్రమాలను ప్రారం భించి అమలు చేస్తోందన్నారు. ఇది ప్రజా ప్రభు త్వమని, క్రమశిక్షణతో పాల న సాగిస్తోందన్నారు. కార్యక్రమం లో మండల ప్రత్యేక అధికారి డాక్టర్ కిరణ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ చౌగోని రజితాశ్రీనివాస్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమీషనర్ బాలయ్య, ఎంపీడీఓ చంద్రశేఖర్, తహ సీల్దార్ జము రుద్దీన్, ఎంఈఓ మేకల నాగయ్య, వ్యవసాయాధికారి జానిమియా, కౌన్సిలర్లు గాజుల సుకన్య, దైద స్వప్న రవీందర్ తదితరు లు పాల్గొ న్నారు.
కేతేపల్లి : పేదల అభివృద్ధి, సంక్షే మం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వే ముల వీరేశం అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల మంజూరుకు లబ్ధిదారులనుగుర్తిం చేందుకు మంగళవారం మండలంలోని కేతేపల్లి, భీమారం, ఇప్పలగూడెం, బండపాలెం గ్రామాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహించారు. కేతే పల్లిలో నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హు లైన నిరుపేదలకు అందేలా చూడా ల్సిన బాధ్యత అధికారులపైనే ఉం దన్నారు. కార్యక్రమంలో నకిరేకల్ ఏఎంసీ చైర్మన్ గుత్త మంజుల మా ధవరెడ్డి, డైరెక్టర్లు బయ్య ముత్త య్య, ఎం. పరుషయ్యగౌడ్, మం డల ప్రత్యేక అధికారి జె.హరీష్, తహసీల్దారు ఎన్.మ ధుసూధన్రెడ్డి, ఎంపీడీఓ బి.శ్రీనివాసరావు, ఎం పీఓ నాగలక్ష్మి, ఏఓ బి.పురుషోత్తం కాంగ్రెస్ మం డల అధ్యక్షుడు కె.శ్రీనివాసాయాదవ్, ఎం.వెంక ట్రాంరెడ్డి, జటంగి వెంకటనర్సయ్యా దవ్ తదితరులు పాల్గొన్నారు.