Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Vemula Viresham: ఉద్దీపనతో పేద విద్యార్థుల్లో ఉషోదయం

–పేద విద్యార్థుల కలలు సాకారం చేస్తున్న వైనం
— ఉద్దీపనతో విధ్యార్ధులకు ఉజ్వల భవిష్యత్తు
–నకిరేకల్ పట్టణంలో ఉద్దీపన పాఠ శాల ప్రారంభoలో ఉద్దీపన ఎడ్యుకే షనల్ ఫౌండేషన్ చైర్మన్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం

Vemula Viresham:ప్రజా దీవెన, నకిరేకల్: పేద విద్యా ర్థులు ఉన్నత శిఖరాలు అధిరోహిం చాలనేదే ఉద్దీపన ముఖ్య ఉద్దేశ్య మని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Viresham) పేర్కొన్నారు. శుక్రవారం నకిరేకల్ పట్టణంలో (Nakirekal town) తన మానస పుత్రిక ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఆద్యరంలో నిర్వహిస్తున్న ఉద్దీపన వి. వి. యం పాఠశాలను వారు ప్రారంభించారు.భువనగిరి పార్లమెంటు (Bhuvanagiri Parliament) సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లా డుతూ ఆర్థిక ఇబ్బందుల ఉన్న పిల్లలకు విధ్యను అందించేయడమే ఉద్దీపన ముఖ్య ఉద్దేశ్యమని, సా మాన్య కుటుంబంలో పుట్టి గొప్ప ఆలోచనలు చేస్తున్న వీరేశంకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (revanth reddy)ప్రభు త్వ పాఠశాలల్లోనే విధ్యలో గుణా త్మక మార్పులను తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఉద్దీప న స్కూల్ ని ఏర్పాటు చేసి, పేద విద్యా ర్థులను ఉన్నత చదువు చదవాలని నేడు పాఠశాలను ప్రారం భించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి హృదయ పూర్వక ధన్యవాదములు తెలిపారు. మట్టి లో కూడా మాణిక్యాలను తయారు చేస్తున్న వీరేశంకు అందరికీ ఆదర్శ మని వ్యాఖ్యానించారు. ఈ పాఠ శాలని ఆదర్శంగా తీసుకుని మా ప్రాంతంలో కూడ విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ నేటి ఉద్దీపన కార్యక్రమంలో భాగంగా నకిరేకల్ పట్టణంలోని స్కూల్ ని స్థాపించి, విద్యార్థులకు, కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు కృషి చేస్తున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు (Vemula Viresham) హృదయ పూర్వక ధన్య వాదములని చెప్పారు.

ఒక వ్యక్తి జీవితం మారటానికి విద్య దోహదం చేస్తుందని, వెయ్యికోట్ల రూపాయల ఖర్చు చేసిన దానికంటే అoత కన్నా ఎక్కువ ఈ కార్యక్రమం పనిచేస్తుం దని, ఈ పాఠశాలలో విధ్యార్ధులు భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుం టున్నట్లు అశించారు. ఈ కార్యక్ర మంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరె డ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ మా జీ చైర్మన్ నేతి విద్యా సాగర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్,బిసి ఫైనా న్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజ ర్ల శంభయ్య, నల్గొండ డిఈవో బిక్ష పతి, ఉద్దీపన చీఫ్ అడ్వైజర్ కె. ఆనంద్, మంగారెడ్డి, హెడ్ మాస్టర్ భద్రయ్య, విద్యార్థులు, తల్లిదం డ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.