–ఆర్థిక స్వావలంబన సాధనకు కృషి చేయాలి
–నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
Vemula Viresham: ప్రజా దీవెన, నకిరేకల్ : ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను (Welfare schemes) ప్రజల్లోకి తీసుకెళ్లి మహి ళల్లో ఆర్థిక స్వావ లంబన కోసం కృషిచేయాలని నకిరే కల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో నియో జకవర్గస్థాయి డీఆర్డీఏ ఐకేపీ, సీసీలు, సెర్ప్ (DRDA IKP, CCs, Serp) ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ మహిళా సంఘాల్లోని నిరుపేద మహిళలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడా లన్నారు. క్షేత్ర స్థాయిలో పథకాలు అందిస్తే వారి కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ సమా వేశంలో ఏపీడీ మోహన్రెడ్డి, కొండ మట్టయ్య, ఆయా మండలాల ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం మండలంలోని నోముల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రం భవనాన్ని ఎమ్మె ల్యే (mla)ప్రారంభించారు.
నార్కట్ పల్లి: పేదింటి ఆడబిడ్డ (A poor girl)తల్లిదండ్రులకు భారం కావొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యా ణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టిం దని ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Viresham)తెలిపారు. గురు వారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 55 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మండల పరిషత్ కార్యా లయంలో ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. కార్య క్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వ రరావు, ఎంపీడీఓ ఉమేష్, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య, వైస్ ఎంపీపీ కల్లూరి యాదగిరి, ఆర్ తరుణ్, పాశం శ్రీనివాస్డ్డి, భాగ్యమ్మ, చిరుమర్తి యాదయ్య, పుల్లెంల ముత్తయ్య, సిద్దగో ని స్వామి, రమేష్, తదితరు లు పాల్గొన్నారు.
సబ్ సెంటర్ ప్రారంభం… గ్రా మాల్లో ఏర్పాటు చేసిన ఆరోగ్య సబ్ సెంటర్ (Health Sub-Centre)లను సద్వినియోగం చేసు కోవాలని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండల పరిధిలోని ఎల్లా రెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన సబ్ సెంటర్ ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనం తరం స్థానిక హైస్కూల్ (high school) ప్రహరీకి శంకుస్థాపన చేశారు. ఆయా కార్య క్రమాల్లో డీఎంహెచ్వై కళ్యా ణ్ చక్రవర్తి, డిప్యూటీ డీఎంహెచ్ వేణుగోపాల్రెడ్డి, డాక్టర్ అరుంధతి, డాక్టర్ గాదరి రామకృష్ణ, బత్తుల ఉషయ్య, వడ్డే భూపాల్రెడ్డి, సట్టు సత్తయ్య, సాగర్ల సైదులు, నేతగాని కృష్ణ, సీఎచ్ఓ శ్రీరాములు, మమత, శేఖర్, చిక్కుల శివ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.