–రాజకీయాలు రోజుకు దారుణంగా మారుతున్నాయి
–ఏ రాజకీయ నాయకుడు ఎప్పు డు ఏ పార్టీలో ఉంటాడో తెలియడం లేదు
–నెల్లూరు పర్యటనలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Venkaiah Naidu: ప్రజా దీవెన, నెల్లూరు: దేశంలో, రాష్ట్రాల్లోని చట్టసభల్లో నాయకులు హుందాగా మాట్లాడాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (venkaiah Naidu)హితవు పలికారు. దేశంలో రాజకీ యాలు రోజు రోజుకూ దారుణంగా మారుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఏ రాజకీయ నాయకుడు(political leader)ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియడం లేదని చమత్కరించారు. మంత్రి సత్యకుమార్ (Satya Kumar(తనతో దాదాపు 27 ఏళ్లు ఉన్నారని చెప్పారు. మంత్రి సత్య కుమార్కు శుభాకాంక్షలు తెలిపారు.ఎవరైనా తమ తమ వంశాల నుంచి ఎవరో ఒకరిని రాజకీయల్లో ఉండాలని కోరు కుంటారని అన్నారు.ఆదివారం నెల్లూరు జిల్లాలో వెంకయ్య నాయు డు (venkaiah Naidu)పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన కొడుకు, కూతురును రాజకీయాల్లో కి తీసుకు రావాలని చాలామంది తనపై ఒత్తిడి తెచ్చారని గుర్తుచే శారు. వారు వారి వారి పనుల్లో బిజీగా ఉన్నారని వెంకయ్య నాయు డు తెలిపారు.వారు ప్రశాంతంగా ఉన్నారని తెలిపారు. వారికి ఇష్టమైన పని వారిని చేసుకొనివ్వా లని సూచించారు. తనకు ఇష్టమైన పని తాను చేస్తానని అన్నారు. కుమారులు, కూతుర్లను రాజకీ యంలోకి తీసుకురావాలని ఎవరూ ఒత్తిడి తేవద్దని అన్నారు. రాజకీ యాల్లోకి యువత రావాలని వెంక య్య నాయుడు సూచించా రు. రాజకీయాల్లోకి (political)వచ్చి సిద్ధాంత పరమైన రాజకీయలు చేయాలని కోరారు. చట్టసభలకు ఎన్నికైన యువత ఆ చట్టసభలకు గౌరవం తేవాలని వెంకయ్య నాయుడు అభిలాషించారు. పార్టీ మారితే పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని అన్నారు. కులం, ధనాన్ని బట్టి ఓటు వేయడం కాదని , గుణా న్ని చూసి ఓటు వేయాలని కోరారు. వ్యక్తి గుణాన్ని బట్టి నడవడక ఉండాలని చెప్పారు. ఓటు వేయక పోతే ప్రజాస్వామ్యనికి చేటని అన్నా రు . అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అని పేర్కొన్నారు. తెలుగు వంటలు, తెలుగు వేషధారణ , వ్యవసాయం తనకు చాలా ఇష్టమని వెంకయ్య నాయుడు (venkaiah Naidu)తెలిపారు.