Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Veterinary Wonder: పశువైద్యoలో అత్యద్భుతం, అద్దె గర్భంతో జన్మిoచిన ఆవు దూడ

ప్రజా దీవెన, విజయనగరం: అద్దె గర్భంతో పిల్లలు పుట్టడం ఇటీవల మనం తరుచూ చూస్తూనే ఉన్నాం. సెలబ్రెటీలలో అయితే సర్వసాధారణంగా మారింది. అయితే అదే తర హా అద్దె గర్భం ద్వారా ఒక సంకర జాతి ఆవు అరుదైన గిర్ జాతి ఆవుకు జన్మని చ్చిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసు కుంది. జిల్లాలోని రామభధ్రాపురం మండలం జగన్నాధపురం లో ఈ ఏడాది మార్చి 9 న గిర్ జాతి ఆవు పిండాన్ని ఒక సంకరజాతి ఆవులో ప్రవేశపెట్టారు.

ఆ విధంగా ప్రవేశ పెట్టిన పిండం డిసెంబర్ 15 న ఆరోగ్యవంతమైన గిర్ జాతి ఆడ పెయ్యకు జన్మనిచ్చింది. రైతులు ఇలాంటి సరోగసి పద్ధతి ద్వారా విభిన్న జాతుల ఆవుల ఉత్పత్తి వైపు దృష్టి సారించాలని కోరుతు న్నారు పశువైద్యాధికారులు. సహ జంగా ఆవు తన జీవితకాలంలో ఎనిమిది నుండి పది దూడలకు మాత్రమే జన్మనివ్వగలదు. కానీ ఈ సరోగసి విధానం ద్వారా సుమారు 50 నుండి 60 దూడల వరకు జన్మ నివ్వగలదు. ఇలాంటి ప్రక్రియ చేసేం దుకు ఇద్దరు పశువైద్యులు కూడా ప్రత్యేక శిక్షణ పొందారు. అద్దెగర్భంతో ఆవు జనన ప్రక్రియ ఎలా? జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ వైద్యులు వినూత్న ప్రయోగం చేసి విజయవంతంగా అద్దె గర్భంతో గిర్ జాతి ఆవుకు జన్మనిచ్చారు. చింతల దీవిలో ఉన్న నేషనల్ కామధేను ప్రాజెక్టు వారి వద్ద ఉన్న మేలు జాతి సాహివాల్, గిర్ మరియు ఒంగోలు జాతి ఆవు నుండి ముందుగా అండాలను సేకరించారు.

ఆ అండాలను ఇన్వె ట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా మేలు జాతి ఆంబోతు వీర్యంతో ఫలదీకరణ చేశారు. అలా ఏడు రోజులు ప్రయో గశాలలో శాస్త్రీయ విధానంలో ప్రక్రియ చేసి పిండలుగా మార్చి అనంతరం ఆ పిండాలను ధ్రవ నత్రజనిలో భద్రపరిచారు. అలా భద్రపరిచిన పిండాలను ఎదకు వచ్చిన ఒక సంకర జాతి ఆవును ఎంపిక చేసి ఆ ఆవులో ప్రవేశపె ట్టారు. అలా ప్రవేశపెట్టిన తరువాత సహజసిద్ధంగానే తొమ్మిది నెలలకు సంకరజాతి ఆవు గిర్ జాతి ఆవుకు జన్మనిచ్చింది.

అద్దెగర్భంతో ఆవు జననం ఎందుకు? ఇటీవల కాలం లో పలు జాతుల ఆవుల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతున్న నేపథ్యం లో పశు వైద్యాధికారులు ఈ సరో గసి విధానం ద్వారా మేలు జాతి ఆవుల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా సాహివాల్, గిర్, ఒంగోలు జాతుల వంటి అంతరిస్తున్న ఆవుల ఉత్పత్తి పై ప్రత్యేక దృష్టిసారించి ఈ ప్రక్రియను అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఉత్తరాంధ్రలో మొట్టమొదటిసారిగా అద్దె గర్భంతో సంకరజాతి ఆవు నుండి గిర్ జాతి ఆవు జన్మించే ప్రక్రియను చేపట్టి సఫలం అయ్యారు. రైతులు ఇలాంటి సరోగసి విధానం ద్వారా మేలు జాతి ఆవుల ఉత్పత్తికి ముందుకు రావాలని సూచిస్తున్నారు పశువైద్యాధికారులు.