Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Vice Chairman G Chinna Reddy : మూలాలు వెతికి సమస్యలు పరిష్కరిస్తున్నాం

–సీఎం ప్రజావాణి సక్సెస్ రేటు 66 శాతంతో విశ్వాసం పెరిగింది

–రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జీ చిన్నారెడ్డి

Vice Chairman G Chinna Reddy : ప్రజా దీవెన హైద రాబాద్ :సమస్య మూలాలకు వెళ్లి ఆ సమస్య పరి ష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుందని, సీఎం ప్రజా వాణిలో ఇదే తరహా పద్ధతిని తాము అనుసరి స్తున్నామని రాష్ట్ర ప్రణాళికా సం ఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నా రెడ్డి అన్నారు. బుధ వారం ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి లో “” సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ — ది రోల్ అఫ్ ప్రజావాణి అండ్ ప్రజా పాలన ఇన్ తెలంగాణ “” అనే అంశంపై జరిగిన సింపోసియంలో చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సంద ర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కా రంలో సీఎం ప్రజావాణి అధికారులు, సిబ్బంది అంకితభావంతో బాధ్య తలు నిర్వహిస్తున్నారని పేర్కొ న్నారు. ప్రతి మంగళవారం, శుక్ర వారం నిర్వహించే ప్రజావాణి ఇప్పటివరకు 110 వారాలు పూర్తి చేసుకుందని, ఇప్పటివరకు 92,072 దరఖాస్తు వచ్చాయని, అందు లో వివిధ సమస్యలపై 53,303 దరఖాస్తులు రాగా అందులో 35,001 దరఖాస్తులను పరిష్కరించినట్లు చిన్నారెడ్డి వివరించారు.

దరఖాస్తులు సక్సెస్ రేటు 66% ఉందని ఆయన తెలిపారు. మిగతా 38,769 దరఖాస్తులు వివిధ పథకాల కోసం రావడంతో వాటిని పరి ష్కరిం చేం దుకు సంబంధిత శాఖ అధికారు లకు పంపినట్లు చిన్నా రెడ్డి పేర్కొ న్నారు.సీఎం ప్రజావాణి పట్ల ప్రజ ల్లో నమ్మకం పెరిగిందని ప్రజావాణి కి వెళితే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్రజల్లో వి శ్వాసం కలుగుతోందని ఇది కదా ప్రజా పాలన అని చిన్నారెడ్డి అన్నా రు.


దరఖాస్థులలో ఎక్కువ శాతం ఇళ్ల కోసం, రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం వస్తున్నాయని, ధరణి లోపాలపై కూడా చాలా దరఖాస్తులు వస్తు న్నట్లు ఆయన తెలిపారు. ప్రజావాణిలో పకడ్బందీగా సిస్టం ఏర్పాటు చేశామని, శాఖల వారీగా డెస్క్ ఆఫీసర్స్, నోడల్ ఆఫీసర్స్, స్టేట్ నోడల్ ఆఫీసర్, ఆన్లైన్ ద్వారా ఆయా శాఖలకు దరఖాస్థులు పంపించి మానిటరింగ్ చేసే డెస్క్, ట్రాకింగ్ డెస్క్ వ్యవస్థ పనిచేస్తోం దని చిన్నారెడ్డి వివరించారు.ధరఖాస్థులు తాము స్వీకరించ డమే కాకుండా వాటిపై ఎంద ర్స్మెంట్ చేసి సంబంధిత అధికా రులతో ఫోన్ లో మాట్లేడుతు న్నామని చిన్నారెడ్డి తెలిపారు.

ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ మాట్లాడుతూ సీఎం ప్రజావాణిని ప్రతిస్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్నట్లు తెలి పారు. రానున్న రోజుల్లో క్షేత్ర స్థాయిలోనే సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోనున్నట్లు దివ్య పేర్కొన్నారు.హైడ్రా కమీషనర్ వీ. రంగనాధ్ మాట్లాడుతూ చెరు వులు, కుంటలు, నాలాలను చెరబ ట్టిన వారిపై నిబంధనల మేరకు చ ర్యలు తీసుకుంటున్నట్లు తెలిపా రు. ప్రభుత్వ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కలిగిస్తున్నామని, ప్రభు త్వ భూములు, ఆస్తులను కబ్జా చేస్తే సహించేది లేదని రంగ నాధ్ అన్నారు.ఈ కార్యక్ర మంలో సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ హెడ్ కెప్టెన్ లింగాల పాండురంగా రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విష్ణు, తదితరులు పాల్గొన్నారు.