— ఎఐసిసి కార్యదర్శి విశ్వనాథ్ పెరుమాళ్
Vishwanath Perumal : ప్రజా దీవెన, మహబూబ్ నగర్: క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు పని చెయ్యాలని ఎఐసిసి కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ విశ్వనాథ్ పెరుమాళ్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల పరిచయ కార్య క్రమానికి ఆయన ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు. ఈ సంద ర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలను ఆయ నకు పరిచయం చేశారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ శ్రీ విశ్వనాథ్ పెరుమాళ్ పరిచయ కార్యక్రమం లో భాగంగా జిల్లా కాం గ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్త లను ఆయనకు పరిచయం చేశా రు. అనంతరం ఎఐసిసి కార్యదర్శి శ్రీ విశ్వనాథ్ పెరుమాళ్ మాట్లా డుతూ కాంగ్రెస్ పార్టీకి కష్టపడిన వారిని తప్పకుండా గుర్తిస్తుంది అని మీ కష్టం ఎప్పటికీ వృధా కాదని, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి పనిచేసిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, సంజీవ్ ముదిరాజ్, టి పిసిసి అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, ఎన్ పి వెంకటేష్, మహిళా అధ్యక్షురాలు వసంత, హన్వాడ మండల అధ్యక్షులు వి.మహేందర్ , సిజె బెనహర్ నాయకులు అజ్మత్ అలి, సాయిబాబా, రాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.