వివాహేతర సంబంధమే కారణమా?
VRA murder: ప్రజా దీవెన, కడుప: వైఎస్సార్ కడప జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో వీఆర్ఏ నరసింహులు (VRA murder)మృతి చెందిన విషయం తెలిసిందే. నిద్రిస్తున్న సమయంలో నరసింహులు మంచం కింద గనులు పేల్చడానికి వాడే డిటోనేటర్లతో పేల్చి చంపినట్లు తెలిసింది. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే (An extramarital affair)కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన నరసింహులు భార్య సుబ్బలక్ష్మమ్మ వేంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో (Government Hospital) చికిత్స పొందుతోంది.