*విద్యార్థులు సామాజిక సేవా దృక్పథం అలవర్చుకోవాలి.: మండల విద్యాధికారి
Walkers Club : ప్రజా దీవెన, కోదాడ: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సామాజిక సేవా దృక్పథాన్ని అలవర్చు పోవాలని కోదాడ మండల విద్యాధికారి ఎండి షరీఫ్ అన్నారు పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆరుగా ఉన్నత పాఠశాల ఆవరణలోఆదివారం పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు పరీక్షా పదిల ఫలితాలలో టాపర్లుగా నిలిచిన సందర్భంగా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో 571 మార్కులు సాధించిన తాళ్లూరి రేఖ శ్రీ 5000 రూపాయలు 549 మార్కులు సాధించిన కే నరేందర్ 3000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారున.
సందర్భంగా వాకర్స్ క్లబ్ బాధ్యులు కళ్యాణ్ బాబు, తిరుపతయ్య, జానకిరామ్ రెడ్డి, జొన్నలగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ సాధారణ విద్యార్థులు ఉపాధ్యాయుల గైడెన్స్ తో స్వయంగా కష్టపడి చదివి జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరచడం నిజంగా గొప్ప విషయం, అభినందనీయమని, వారికి ఆర్థిక సహాయం అందించి తోడ్పడటం వాకర్స్ క్లబ్ కృషి అభినందనీయమని తెలిపారు అనంతరం విద్యార్థులను పుష్పగుచ్చాలతో మెమొంటొలతో అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు డి. మార్కండేయ, ఉపాధ్యాయులు బడుగుల సైదులు, వాకర్స్ క్లబ్ సభ్యులు వీరభద్రం, అశోక్, కాజా ఫాతిమా, కోదండపాణి, అబ్దుల్ , ఖాజా , మధు, ఇంద్ర కిర ణ్, దస్తగిరి, ఖాజా మియా, సతీశ్, కాంతయ్య, మురళి, ముస్తఫా, విద్యార్థులు క్రీడాకారులు పాల్గొన్నారు.