–సహాయక చర్యల్లో భాగస్వామ్య మైన నేవీ, రెస్క్యూ బృందాలు
–ఇప్పటి వరకు 174 కు చేరిన మృతుల సంఖ్య
–వరదలకు అతలాకుతలమవుతో న్న కేరళ
Wayanad:ప్రజాదీవెన, వయానాడ్: కేరళలో (Kerala) కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజా జీవనం అతలాకుతలమైంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాయనాడ్ (Wayanad)జిల్లాలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విపత్తు కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 174కి చేరింది. వందలాది మంది గాయపడ్డారు, ఇక కొందరు చిక్కుకుపోయారు. కొండచరియలు విరిగిపడడం వల్ల భారీ విధ్వంసానికి (to massive destruction) దారి తీసింది. చెట్లు, ఇళ్లు కూలిపోయాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
బాధితులకు అండగా నిలిచేందుకు ఆర్మీ, నేవీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ల నుంచి భారీ సంఖ్యలో రెస్క్యూ టీమ్‌లు సహాయం కోసం రంగంలోకి దిగాయి. ఉపబలాల్లో కన్నూర్‌లోని DSC సెంటర్ నుంచి సుమారు 200 మంది భారతీయ ఆర్మీ సిబ్బంది, కోజికోడ్ నుంచి 122 TA బెటాలియన్, (TA Battalion,) అలాగే రెండు వైమానిక దళ హెలికాప్టర్లు, ఒక Mi-17, ఒక ALH, వైమానిక రెస్క్యూ ప్రయత్నాలను సమన్వయం చేస్తున్నారు. ఇక రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్తో పాటు భారతి వాలంటీర్లు సైతం పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సభ్యులు కూడా బాధితులకు అండగా నిలుస్తున్నారు.
ఈ వాలంటీర్లు (Volunteers) మరణించిన వారిని గుర్తించడంలో NDRF బృందాలకు సహాయం చేస్తున్నారు. అలాగే సర్వస్వం కోల్పోయిన వారికి ఆహారంతో ఆశ్రయం కల్పిస్తున్నారు. ఆహార శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. తప్పిపోయిన వారికి సైతం సాయం చేస్తున్నారు. ఇక మరణించిన వారి అంత్యక్రియలకు సైతం సహకరిస్తున్నారు. వాయాడ్కు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వందలాది మంది స్వయంసేవకులు సాయం అందించడానికి వస్తున్నారు. ప్రమాదంలో ఇరుక్కున్న వారికి సాయం అందించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. అలాగే గాయపడిన వ్యక్తులను ఆసుపత్రులకు తరించేందుకు సహాయం చేస్తున్నారు. క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందేలా సాయం చేస్తున్నారు. ఆసుపత్రుల్లో కూడా గాయపడిన వారికి ఆహారం (the food)ఏర్పాటు చేస్తున్నారు.
‘ప్రజలంతా సహకరించాలి’
వయనాడ్ జిల్లాలో జరిగిన విధ్వంసం నుంచి కోలుకోవడానికి ప్రజలంతా సహకరించాలని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రజలకు పిలుపునిచ్చారు. మళ్లీ పునర్నిర్మించుకోవడానికి సాయమందించాలని కోరారు. 2018 వరదల సమయంలో ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని, అదే తరహా సాయం మళ్లీ కావాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు పంపించాలని సూచించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. వారి కోసం సమీపంలోని చర్చిలు, మదర్సాల్లో తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేశామని వెల్లడించారు.