–బాధితులను పరామర్శించిన రాహుల్, ప్రియాంక గాంధీలు
Wayanad: ప్రజా దీవెన, వయనాడ్: కొండచరియలు (Landslides) విరిగిపడటంతో కేరళ రా ష్ట్రం వయనాడ్ జిల్లాలోని (Wayanad) రెండు గ్రామాలు తుడిచిపెట్టుకుపోవడంతో ఆత్మీయులను కోల్పోయిన బాధలో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. వారికి భరోసానివ్వడానికి కాంగ్రెస్ అగ్రనేత లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాం ధీ (Rahul Gandhi and Priyanka Gandhi)ఆగస్టు 1న వయనాడ్‌లో పర్య టించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వయనాడ్ పర్యటన వాయిదా పడిన ఒక రోజు తర్వాత రాహుల్, ప్రియాంక గు రువారం మధ్యాహ్నం కేరళకు చేరు కున్నారు.ఇరువురు నేతలు కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సహాయ శిబి రాలను సందర్శించారు. ఇరువురు ఉదయం 9.30కు కన్నూర్ విమానా శ్రయంలో దిగి రోడ్డు మార్గంలో వ యనాడ్‌కు వెళ్లారు.
మధ్యాహ్నాని కి చూరల్‌మల చేరుకున్నారు. వీరి వెంట ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (AICC General Secretary), అలప్పుజా ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు. ఇది ఇలా ఉంటే కొండచరియలు విరిగిపడిన ప్రదేశంతో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్, డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజ్, మెప్పా డిలోని రెండు సహాయ శిబిరాలనూ సందర్శిం చారు.కొండచరియలు విరిగిపడటం తో భారీ వృక్షాలు సైతం గ్రామాలపైకి వచ్చాయి. దీంతో వాటిని తొలగిం చేందుకు భారీ యంత్రాలు అవసర మని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. భారీ యంత్రాలతోనే సెర్చ్ ఆపరేష న్‌లో పురోగతి సాధిం చగలమని ఆయన అన్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఆర్మీ, నేవీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీసు, ఫైర్ అండ్ రెస్క్యూ, ఇతర బలగాలతో సహా 1,600 మందికి పైగా రెస్క్యూ వర్కర్లు (Rescue workers) సహాయక చర్యల్లో పాల్గొన్నారని కేరళ రెవెన్యూ శాఖ మంత్రి రాజన్ తెలిపారు.