Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Wayanad: శిథిలమైన చోటనే జీవితం

–నలుగురిని కాపాడిన రక్షక దళాలు
–వాయనాడ్ లో 319కి చేరిన మృతుల సంఖ్య

Wayanad: ప్రజా దీవెన, వాయనాడ్ :వాయనాడ్ (Wayanad)జిల్లాలో కొండచరియలు విడిగినపడిన దుర్ఘటనలో మృతల సంఖ్య 319కి చేరింది. వాయనాడ్ లోని (Wayanad) మారు మూల ప్రాంతంలోని మునక్కాయి గ్రామం లో ఒక ఇంటిలో మూడు రోజులుగా చిక్కుకు పోయి ఉన్న ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళ లను రక్షక దళాలు కాపాడి వారిని బంధువు ఇంటికి తరలించారు. వారిలో ఒక మహిళ కాలికి గాయ మైందని ఆర్మీ కమాండర్ వీటీ మాథ్యూ చెప్పారు. వారిని ముంద క్కాయిలోని పడవెట్టికున్ను గ్రామానికి చెందిన జాను, జోముల్, అబ్రహాం మాథ్యూ, క్రిస్టీగా గుర్తించారు. వారు మారుమూల ప్రాంతంలోని ఇంటిలో చిక్కుకు పోయా రని, అయితే శిథిలాల కింద చిక్కుకొని లేరని ఆర్మీకమాం డర్ తెలిపారు. శుక్రవారం ఉదయం వీరి గురించి సమా చారం అందిన వెంటనే సహాయ బృందాలు అక్క డికి చేరుకుని వారిని కాపాడాయి.

‘వారు ఉన్న ఇంటికి (house) కుడి వైపు కొండచరియ విరిగిపడటంతో మొ త్తం కొట్టుకుపో యింది. అయితే ప్రమాదం తొలగిపోయిందని భావిం చిన వారు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. వారి వద్ద పెంపుడు జంతువులు కూడా ఉన్నాయి. చుట్టుపక్కల ఎవరూ లేకపోయినా..వారు అక్కడే ఉండిపోయారు’ అని అధికారులు తెలిపారు. వారికి నచ్చజెప్పిన సహాయ సిబ్బంది.. వారిని అక్కడి నుంచి తరలించారు. ఇదిలా ఉంటే.. శిథిలాల కింద చిక్కుకుపోయిన మృతదేహాలను గుర్తించేందుకు ఉపకరించే డ్రోన్ (drone) ఆధారిత రాడార్ను ఢిల్లీ నుంచి వాయనాడ్కు తీసుకొచ్చారు. సహాయ చర్యల్లో సహకరించేందుకు గాను మృతదేహాలను (dead bodies) గుర్తించే నాలుగు జాగిలాలను కూడా చెన్నై నుంచి వాయనాడ్కు తెప్పిస్తున్నారు.ఆరు ప్రభావిత ప్రాంతాల్లో మృత దేహా లను వెలికి తీసేందుకు అధికారులు శుక్రవారం 40 సెర్చ్ టీమ్ లను ఏర్పాటు చేశారు. దీనితోపాటు చలి యార్ నదిలో కొట్టుకుపోయిన మృతదేహాలను వెలికితీ సేందుకు ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతు న్నది. ఇందుకోసం స్థానిక గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. ఈ మొత్తం ఆపరేష నునది వెంబడి 40కిలో మీటర్ల వరకూ ఉన్న 8 పోలీస్ స్టేషన్ల ల అధికారులు పర్య వేక్షిస్తున్నారు. ఇప్పటి వరకూ వాయనాడ్ ప్రకృతి బీభ త్సంలోచనిపోయినవారి సంఖ్య 319కి చేరుకున్నది..