–వయనాడ్ లో 300 లకు చేరువ లో మృతుల సంఖ్య
–మరో 200 మంది గల్లంతయినట్లు వెల్లడి
Wayanad : ప్రజా దీవెన, వయనాడ్ : కేరళలోని వయనాడ్ (Wayanad)జిల్లాలో ప్రకృతి సృష్టిం చిన విలయంలో మృతుల సంఖ్య 291కి చేరింది. మరో 200 మంది అచూకీ గల్లంతైనట్లు అధికారులు తాజాగా అంచనా వేశారు. మృతు ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశము న్నట్లు చెబుతున్నారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొండచరి యలు (Landslides)విరిగిపడటంతో ముండకై, చూరాల్మల ప్రాంతాలు ఆనవాళ్లు లేకుండాపోయిన సంగతి తెలిసిం దే. వందలాది గృహాలు నేలమట్టమ య్యాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీ ఆర్ఎఫ్ బృందాల (Army, NDRF, NDRF teams) సహాయక చర్య లు కొనసాగుతున్నాయి. బురద తొలగిస్తున్నకొద్దీ శవాలు బయపడు తున్నాయని సహాయక బృందాలు చెబుతున్నాయి. గత మూడు రోజు లుగా సహాయక చర్యలు కొనసాగు తున్నాయి. కొన్ని చోట్ల తాళ్ల సా యంతో తాత్కాలిక వంతెనలను నిర్మించి ప్రజలను సురక్షిత ప్రాంతా లకు తరలిస్తున్నారు. కేరళలోని చాలా పర్వతాల వాలు 20 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. దీనివల్లే ప్రమాదతీవ్రత అధికంగా ఉన్నట్లు అధికారులు అభిప్రా యపడుతున్నారు. విరిగిపడిన కొండచరియల శిథిలాలు నదిలో 8కి.మీ మేర కొట్టుకెళ్లినట్లు తెలి పారు. తవ్వినకొద్దీ బయటపడు తున్న మృతదేహాలు వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటన లో శిధిలాలను తీస్తున్న కొద్దీ మృత దేహాలు బయటపడుతూనే ఉన్నాయి.
ఇప్పటికే 200లకు పైగా దేహాలను బం పటకు తీసినట్లు సమాచారం. అయితే, దారుణ స్థితిలో ఉన్న వాటిని చూసి వైద్యు లు కూడా వణికిపోతున్నట్లు తెలు స్తోంది. అక్కడి హృదయవిదారక పరిస్థితులతో కలత చెందుతున్న ట్లు శవపరీక్షలు చేస్తోన్న వైద్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో ఛిద్రమైన మృతదేహాలకు పోస్టుమార్టం చేయలేక పారిపోవాల నుకున్నట్లు ఓ ప్రభుత్వ వైద్యురాలు (Government doctor) చెప్పడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. ఎన్నో ఏళ్లుగా వైద్య వృత్తిలో ఉన్నా. ఎన్నో మృత దేహాలకు పోస్టుమార్టం చేశా. ఇక్క డ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఓ శరీరం చూస్తే మొత్తం ఛిద్రమయ్యింది. రెండోదాన్ని చూడ లేకపోయా, అది కూడా ఏడాది చిన్నారిది. అటువంటి మృతదేహా లు వరుసగా వస్తూనే ఉన్నా యి. అందులో అనేకం గుర్తించలేనంతగా ఉండటం కలచివేసింది. ఇక పోస్టుమార్టం చేయలేనని అనుకున్నా. ఆ ప్రాంగణం నుంచి బాధితుల సంరక్షణ కేంద్రానికి పారిపోదా మనుకున్నా.
కానీ, ప్రత్యామ్నాయం లేదు. అలా మొత్తంగా 18 మృత దేహాలకు (dead bodies) శవపరీక్ష నిర్వహించా అని వయనాడ్ ఘటన ప్రదేశంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ వైద్యురాలు భావోద్వేగంతో వివరించారు. ఒక బృందం అక్కడ ఉండగా.. ఇతర ప్రాంతాల నుంచి ఫోరెన్సిక్, వైద్య బృందాలు చేరుకున్నాయి. రాత్రి 11.30 గంటల వరకు విధులు కొనసాగించాం. మొత్తం ఆ ఒక్కరో జు 93 మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించినట్లు సదరు వైద్యురా లు వెల్లడించారు. అయితే, దారుణ స్థితిలో ఉన్న మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడమనేది అనుభవ మున్న వైద్యులకూ ఇబ్బందిగా మారిందన్నారు. మాన సిక ఒత్తిడిలోనూ విశ్రాంతి లేకుండా వైద్యసిబ్బంది విధులు నిర్వర్తిస్తు న్నారని చెప్పారు. మరో వైపు ప్రాణాలతో బయటపడిన బాధి తులకు కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ (Veena George)పేర్కొన్నారు.