We are giving a few assurances… we will implement it: అరు హామీలు ఇస్తున్నాం… అమలు చేసి తీరుతాం
-- ప్రతి ఒక్కటి నెరవేర్చడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది -- తెలంగాణను కొత్త శిఖరాలకు చేర్చడం మా కర్తవ్యం -- హైదరాబాద్ తుక్కుగూడ ర్యాలీలో సోనియా గాంధీ
అరు హామీలు ఇస్తున్నాం… అమలు చేసి తీరుతాం
— ప్రతి ఒక్కటి నెరవేర్చడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది
— తెలంగాణను కొత్త శిఖరాలకు చేర్చడం మా కర్తవ్యం
— హైదరాబాద్ తుక్కుగూడ ర్యాలీలో సోనియా గాంధీ
ప్రజా దీవెన/ హైదరాబాద్: తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ అరు హామీలు ప్రకటించారు. ఆదివారం హైదాబాద్ లోని తుక్కుగూడలో జరిగిన ర్యాలీలో సోనియా ఆరు హామీలను ప్రకటించారు. అరు హామీల్లో ప్రతి ఒక్కటి నెరవేర్చడానికి తమ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. తెలంగాణలోని మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు ₹ 2,500, గ్యాస్ సిలిండర్లు ₹ 500, రాష్ట్రవ్యాప్తంగా TSRC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందజేస్తామని అన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు 6 హామీలను ప్రకటిస్తున్నాం, వాటిలో ప్రతి ఒక్కటి నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని ఈ గొప్ప రాష్ట్రమైన తెలంగాణ ఆవిర్భావంలో భాగమయ్యే అవకాశం నా సహోద్యోగులతో కలిసి నాకు లభించిందన్నారు.
ప్రస్తుతం రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు చేర్చడం మన కర్తవ్యం అంటూ ఉద్బోధిస్తూ ఇది తన కల అని సోనియా అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల కోసం పని చేసే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రావాలన్నారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని విజయభేరి సభలో బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్ మద్దతుదారులను ‘మమ్మల్ని ఆదరిస్తారా’ అని ఆమె ప్రశ్నించారు.