Praja Deveena
Newspaper Banner
Date of Publish : 07 January 2026, 3:28 pm Posted by : praja deveena

District Collector B. Chandrashekhar : మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సిద్ధంగా ఉన్నాం 

–నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

District Collector B. Chandrashekhar : ప్రజా దీవన నల్గొండ : నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్ని కల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని కి వివరించారు.బుధవారం రాష్ట్ర ఎ న్నికల కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పై వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు. నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఏర్పా ట్లపై జిల్లా కలెక్టర్ ర్రాష్ట్ర ఎన్నికల క మిషనర్ కు వివరిస్తూ జిల్లాలోని 7 మున్సిపాలిటీలో ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామన్నారు.

అఖిలపక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఓటరు జాబితాపై వా రు ఇచ్చిన అభ్యంతరాలు స్వీకరిం చామని, ఓటరు జాబితాలో ఫోటో లు రావాలని కొంతమంది రాజకీ య పార్టీల ప్రతినిధులు అడిగారని తెలిపారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లు చేశామని, అలాగే బ్యాలెట్ బాక్సు లు,టీముల ఏర్పాటు, సిబ్బంది శిక్ష ణ,తదితర ఏర్పాట్లు చేస్తున్నట్లు చె ప్పారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో మున్సిపాలిటీ ఎ న్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అం తకుముందు రాష్ట్ర ఎన్నికల క మి షనర్ రాణికుమిదిని జిల్లా కలె క్టర్ల తో మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎ న్నికలకు సంబంధించిన ఏర్పాట్లను ఓటరు జాబితా మరియు అఖిలప క్ష సమావేశాల ఏర్పాటు సమావే శంలో వారు చెప్పిన విషయాలను అడిగి తెలుసుకున్నారు.

ఓటరు జాబితాలో తప్పులు లేకుం డా చూసుకోవాలని, ఎన్నికల కమి షన్ ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చే సిన ఎన్నికలకు సిద్ధంగా ఉండాల ని, అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేసు కోవాలని ,అఖిలపక్ష ప్రతినిధుల నుండి ఓటరు జాబితా పై స్వీకరిం చిన అభ్యంతరాలు, వారు చెప్పిన అభ్యంతరాల ను పరిగణంలోకి తీ సుకొని తుది ఓటరు జాబితా ప్రక టించాలని చెప్పారు.

పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రా లు ,రిసెప్షన్ కేంద్రాల వివరాలను అ డిగి తెలుసుకున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చే సుకోవాలని, సమస్యాత్మక, అత్యం త సమ స్యాత్మక పోలింగ్ కేంద్రాలు, ఎన్ని కల ప్రవర్తన నియమావళి అ మలు ఏర్పాటు వంటి అంశాలపై సూచనలు చేశారు.స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్, ఆర్ డిఓ వై. అశో క్ రెడ్డి తదితరులు ఈ వీడి యో కాన్ఫెరెన్స్ కు హాజరయ్యారు.