–బీఆర్ఎస్ నేతలు దమ్ముంటే చ ర్చకు రావాలి
–మంత్రులను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ చెంచాలకు లేదు
–అధికారం పోయి సోయి లేకుండా మాట్లాడుతున్నారు
–జగదీష్ రెడ్డిని గొల్లగూడ ఆస్పత్రి లో చేర్పించాలి
–బిఆర్ఎస్ అలియాస్ టి ఆర్ ఎస్ బాకీ, వడ్డీ కార్డు విడుదల
–ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్
MLC Kethavath Shankar Nayak : ప్రజా దీవెన, నల్లగొండ : రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత బి ఆర్ఎస్ చెంచాలు సోయి లేకుండా మాట్లాడుతున్నారని డిసిసి అధ్య క్షుడు, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నా యక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం నల్గొండలోని మంత్రి కో మటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కా ర్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి తో కలిసి బిఆర్ఎస్ బాకీ కార్డుల పోస్టర్ ను ఆవిష్కరించారు. అనం తరం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పై ఘాటుగా విమర్శించారు.
గడిచిన 10 సంవత్సరాలు అ ధి కారంలో ఉన్నప్పుడు బిఆర్ఎస్ ఎ లాంటి అభివృద్ధి చేయకుండా ప్రా జెక్టుల పేరుతో పేదల సొమ్మును దో చుకుతుందని విమర్శించారు.పేద ప్రజలకు గురించి పట్టించుకున్న దా ఖలాలు లేవని ధ్వజమెత్తారు. అధి కారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని జీర్ణించుకోలేక పోతున్నారని విమ ర్శించారు.
అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చే యలేదని అన్నారు. ఎస్సీలకు మూ డెకరాల భూమిని పంపిణీ చేస్తా మ ని చెప్పి బాకీ పడిందని ఎద్దేవా చే శారు. అదేవిధంగా రైతులకు రుణ మాఫీ ఐదు సంవత్సరాల వడ్డీ బా కీ, నిరుద్యోగులకు నెలకు రూ.300 0 బాకి పడిందన్నారు.ప్రజలకు డ బుల్ బెడ్ రూమ్ ఇండ్ల బాకీ పడిం దన్నారు. వీటన్నింటినీ విస్మరించి ప్ర జలను మోసం చేసిందని అన్నారు.
బిఆర్ఎస్ హయంలో మంత్రిగా ఉ న్న జగదీశ్వర్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. అధికారం కోల్పో యిన తర్వాత ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న జగదీష్ రెడ్డిని గొ ల్లగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో వెం టనే అడ్మిట్ చేయాలన్నారు. తి ప్పర్తిలో ఆరు గ్యారెంటీలపై విడు ద ల చేసిన కార్డుపై నల్లగొండ సెంటర్లో చర్చకు రావాలని సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక 24 వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని అన్నారు. మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వి మ ర్శించే స్థాయి మీకు, మీ చెంచా ల కు లేదని అన్నారు.
నల్లగొండ అభి వృద్ధిపథంలో ముం దుకు పోతుందని స్పష్టం చేశారు. అన్ని ప్రాజెక్టులను పెండింగ్ పెట్టిన ఘనత మీ కెసిఆర్ దని ఎద్దేవా చే శారు. ఏనాడు కేసీఆర్ అసెంబ్లీ లో చర్చకు రాకుండా ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నాడని తెలిపారు. కా ళేశ్వరం పేరు మీద లక్షల కోట్లు దో చుకున్నది వాస్తవo కాదా అని ప్ర శ్నించారు.ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీదని పేర్కొన్నారు.మీరు ధర్నా చౌకులు ఎత్తేస్తే తిరిగి ధర్నా చౌక్ ఏర్పాటు చే శామని తెలిపారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా ఉందని, వ చ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి సూ ర్యాపేటలో గెలిచిన ఒక్క సీటు కూ డా రాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూ ముందుకెళుతుందని చెప్పారు. కొ న్ని గ్యారెంటీలు అమలు కా కపోవ టం టిఆర్ఎస్ చేసిన అప్పులే ము ఖ్య కారణమని అన్నారు.జిల్లా మం త్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉ త్తంకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ప్రాజెక్టు పనులు వేగవంతం అయ్యా యని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని పేర్కొన్నారు.ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమపడ్డ కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుం దని స్పష్టం చేశారు.
*కోమటిరెడ్డి వెంకటరెడ్డి లక్ష మె జార్టీతో గెలుపొందడం ఖాయం*
నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద క్కుతుందని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో గెలుపొందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లక్ష మెజార్టీ తో గెలుపొందడం ఖాయమన్నారు.
నల్గొండ నియోజకవర్గాన్ని అన్ని వి ధాలుగా అభివృద్ధి చేయడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని రంతరం కృషి చేస్తున్నారని తెలి పారు. ఈ విలేకరుల సమావేశంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, కనగల్ మం డల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుఫ్ రెడ్డి, నరేష్ పురం దేవా లయ కమిటీ చైర్మన్ చీదేటి వెంక ట రెడ్డి, మాజీ సర్పంచ్ షబ్బీర్ బాబా, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గా అ ధ్యక్షులు మామిడి కార్తీక్, పట్టణ అ ధ్యక్షుడు గాలి నాగరాజు, కొప్పు న వీన్ గౌడ్, పిల్లి యాదగిరి యాదవ్, కిన్నెర అంజి, పెరికే చిట్టి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.