–జర్నలిస్టుల మహాధర్నాలో నేతల ఉద్ఘాటన
Issue Resolution : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో జర్నలిస్టుల సమస్యలు పరిష్కా రమయ్యే వరకూ సమరం కొనసాగి స్తామని, నిర్లక్ష్యానికి గురవుతున్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లోని సమాచార కమిషనర్ కార్యాలయం ప్రాంగణంలో తెలం గాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం జ రిగిన మహాధర్నాలో ఆ సంఘం రా ష్ట్ర అధ్యక్షుడు విరాత్ అలీ స్పష్టం చేశారు. టీయూడబ్ల్యూజే పిలుపు పై స్పందించి రాష్ట్ర రాజధాని హైద రాబాద్ తో పాటు రాష్ట్ర నలుమూ లల నుండి ఏంతో ఉత్సాహంగా, భారీగా జర్నలిస్టులు తరలివచ్చా రు.
జర్నలిస్టుల నినాదాలతో మహా నగరం రోడ్లన్నీ దద్దరిల్లాయి. సమా చార శాఖ చరిత్రలో ఆ కార్యాల యం వద్ద ఇంత పెద్ద సంఖ్యలో జ ర్నలిస్టులు ధర్నా చేయడం ప్రప్రథ మని పోలీసు అధికారులతో సహా పలువురు సీనియర్ పాత్రికేయులు చర్చించుకోవడo జరిగిందన్నారు.
ఈ మహా ధర్నాకు యూనియన్ అ నుబంధ సంస్థలైన తెలంగాణ ఫో టో జర్నలిస్ట్స్ అసోసియేషన్, తె లంగాణ వీడియో జర్నలిస్ట్స్ అసో సియేషన్, తెలంగాణ చిన్న, మద్య తరగతి పత్రికల సంఘం, మహిళా జర్నలిస్టుల విభాగం, తెలంగాణ ఉ ర్దూ జర్నలిస్టుల సమాఖ్యలతో పా టు హైదరాబాద్ ప్రెస్ క్లబ్, జూబ్లీ హిల్స్ హౌజింగ్ సొసైటీ, జవహర్ లాల్ హౌసింగ్ సొసైటీ, టీజేఏలు సంపూర్ణ మద్ద తును ప్రకటించి మ హా ధర్నాలో భాగస్వామ్యమ య్యా యి. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్య క్షులు కె. విరాహత్ అలీ అధ్యక్షతన జరిగిన
ఈ మహాధర్నాలో ఇండియ న్ జర్నలిస్ట్స్ యూనియన్ స్టీరింగ్ కమిటీ స భ్యులు దేవులపల్లి అమ ర్, ఎం. ఏ. మాజీద్, జాతీయ కార్య దర్శి వై. న రేందర్ రెడ్డి, యూనియ న్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాం నారాయణ, ఉపప్రధాన కార్యదర్శి కలుకూరి రాములు ఐజేయు జాతీ య కార్యవర్గ సభ్యులు కె. సత్యనా రాయణ, నగునూరి శేఖర్, చిన్న ప త్రికల సంఘం అధ్యక్ష, ప్రధాన కా ర్యదర్శులు యూసుఫ్ బాబు, అశో క్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్ర ధాన కార్యదర్శులు సిరిగిరి విజయ్ కుమార్ రెడ్డి, రమేష్, ఫోటో జర్నలి స్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంగాధర్, కె.ఎన్.హ రి, వీడియో జర్నలిస్టుల సంఘం అ ధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగరా జు, హరీష్, జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు గోపరాజులు ప్ర సంగించారు.
యూనియన్ రాష్ట్ర నాయకులు వి. యా దగిరి, కె. శ్రీకాంత్ రెడ్డి,మధు గౌడ్, ఫైసల్, హెచ్ యూజే అధ్యక్షు డు శిగా శంకర్ గౌడ్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు ఏ. రాజేష్, ఉర్దూ జ ర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కా ర్యదర్శి గౌస్, సీనియర్ మహిళా జర్నలిస్టులు విమల, అత్త లూరి అరుణ, వాకటి మంజుల, క ళ్యాణం రాజేశ్వరీ, శ్రీకాంత్ రెడ్డి, బా లరాజు గౌడ్, కోటగిరి దైవాదీనo, దాస్, వెంకటయ్య, అశోక్, యాద గిరి, గోళ్ళ రమేష్,సుభాస్ రెడ్డి తది తరులు పాల్గొన్నారు.


