–కేంద్ర మంత్రులు అర్థం లేని మాట లు మాట్లాడుతున్నారు
–బీసీ రిజర్వేషన్ల విషయంలో బిజె పి నాయకులల్లో స్పష్టత లేదు
–బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్
President Jajula Srinivas Goud : ప్రజా దీవెన, నల్లగొండ: బిజీ రిజ ర్వేషన్లను అడ్డుకుంటే అంతు చూ డాల్సి వస్తుందని బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.ఆదివారం
నల్లగొండ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రా నికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రె డ్డి,బిజెపి నాయకులు ఇష్టం వచ్చిన ట్లుగా మాట్లాడుతున్నారని విమ ర్శించారు. బీసీ జాబితాలో ముస్లిం లను కలిపినారన్న వంకతో కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను అడ్డుకో వడానికి కుట్ర చేస్తుందన్నారు. రా ష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు తమ వైఖరి మార్చుకోకపోతే వారి పర్యటనలను ఆడుకుంటామన్నా రు.
బీసీ రిజర్వేషన్లు అమలు చేయా లని ఆగస్టు రెండో వారంలో సడక్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహి స్తామన్నారు. రిజర్వేషన్ల విషయం లో చర్చించడానికి బిజెపి నాయకు లు రావాలని సవాల్ విసిరారు. హై దరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలోకి వచ్చిన కూడా ఏమీ లేదని, సోమా జిగూడ ప్రెస్ క్లబ్ లో నైనా చర్చిం చుకుందాం అని సవాల్ విసిరారు. అవసరమైతే హైదరాబాద్ లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన చర్చ పెడదామన్నారు.
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజీ కూడా బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉం దని అన్నారు.రాష్ట్రం ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి ఓ సి ఐ కూడా బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలిపారని హర్షం వ్యక్తం చేశారు.రాహుల్ గాం ధీ కూడా బీసీ రిజర్వేషన్లకు మద్ద తు తెలపడం హర్షనేమన్నారు.
ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కా సోజు విశ్వనాథం,నేలపట్ల సత్య నారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ వాడపల్లి సాయిబాబా,నాయకులు చోల్లెటి రమేష్, గోపాలకృష్ణ, ఆది నారాయణ,కేసబోయిన శంకర్ ము దిరాజ్, నల్ల మధు యాదవ్, లాల య్య, కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొ న్నారు.