Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Triple R Project : ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులకు అండగా ఉంటాం 

–కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర చీఫ్ రామచందర్ రావు

Triple R Project : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రీజినల్ రింగ్ రోడ్డు అంశం కేంద్ర ప్ర భుత్వం దృష్టికి రాలేదని కేంద్రమం త్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అ ధ్య క్షుడు రాంచందర్ రావులు స్పష్టం చేశారు. ట్రిపుల్ ఆర్ విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెం టనే తాము భూ నిర్వాసితులకు రై తు లకు అండగా నిలబడతామని హా మీ ఇచ్చారు. ఆదివారం బిజెపి నల్ల గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షి త్ రెడ్డి ఆధ్వర్యంలో సంస్థాన్ నారా యణపురం మండల త్రిబుల్ ఆర్ భూనిర్వాసితులు హైదరాబాదు లో ని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచం ద ర్ రావుని కలిశారు. అదే సందర్భం లో కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డిని కూ డా కలిసి తమ గోడు వెళ్ళబోసుకు న్నారు.

ఈ సందర్భంగా భూనిర్వాసితులు మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్ర భుత్వం నిబంధనలకు విరుద్ధంగా రీజి నల్ రింగ్ రోడ్డు ఇతర ప్రాంతా లలో దాదాపు 40 నుండి 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న రీజినల్ రిం గ్ రోడ్డు మా మునుగోడు నియోజక వర్గం లో ని చౌటుప్పల్ లో గల దివి స్ కంపెనీ ని కాపాడడం కోసం, కొం తమంది రాష్ట్ర ప్రభుత్వ పెద్దల బి నామీల భూములను కాపాడడం కో సం నా రాయణపురం మండలంలో ఔటర్ రింగ్ రోడ్డు నుండి కేవలం 28 నుం డి 30 కిలోమీటర్ల దూరంలోనే అలై న్మెంట్ చేస్తున్నారని వివరించా రు.

మా ప్రాంతం హైదరాబాద్ కు కూ తవేటు దూరంలో ఉంటుందని, అది ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి ఇక్కడ భూముల ధరలు అధికంగా ఉన్నాయని, అం దులోను పంటలకు అనుగుణంగా ఉన్న సారవంతమైన భూములు ఈ భూములన్నీ కూడా ఎకరం రెండెక రాలు మూడెకరాలు ఉన్న రైతుల భూములే ఉన్న సన్నకారు రైతుల భూములు మొత్తం అలైన్మెంట్ లో పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్లఇట్టి త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ను ఇతర ప్రాంతాలలో లాగా 40 నుండి 50 కిలోమీటర్ల దూరంలో వేయాలని అక్కడ భూ ముల ధరలు తక్కువగా ఉండడం తో పాటు ప్రభుత్వానికి దాదాపు 2000 కోట్ల అదనపు భారం తగ్గు తుందన్నారు .

అప్పుడు ఆ రోడ్డు పూర్తిగా వృత్తా కారంలో ఉంటుంది కావున కేంద్ర ప్ర భుత్వం మాకు సహకరించాలని నా రాయణపురం మండల భూ ని ర్వా సితుల సంఘం అధ్యక్షులు పల్లె పు ష్పాల్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తో పాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావులకు విన్నవించు కొని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భూనిర్వాసితుల పక్షా న భారతీయ జనతా పార్టీ పూర్తి అండదండగా ఉంటుoదని అవస రమైతే రైతులతో కలిసి భూ ని ర్వా సితుల పక్షాన పోరాడుతామని నా యకులు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నా యకులు ప్రకాష్ రెడ్డి రాష్ట్ర కార్య వర్గ సభ్యులు దోనూరు వీరా రెడ్డి, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్య దర్శి జక్కలి రాజు యాదవ్, సంస్థా న్ నారాయణపురం మండల భా రతీయ జనతా పార్టీ అధ్యక్షులు సుర్వి రాజు గౌడ్, గుండె మల్లేష్ యాదవ్, పల్లె శేఖర్ రెడ్డి, నడికుడి అంజయ్య, మన్నే నరేందర్ రెడ్డి, ప ల్లె భాస్కర్ రెడ్డి గుప్త నరేందర్ రెడ్డి పొట్ట ప్రభాకర్ గౌడ్, జాల వెంకటేష్, వర్ధం నాగార్జున, గాజుల భగత్, గుండె బుచ్చయ్య, గుండె జంగ య్య, సుక్క గోపాల్ వడ్డేపల్లి స్వా మి, యశోద, జాల లింగస్వామి, వర్ధన్ శేఖర్ చిలువేరు స్వామి శికిల మ్మెట్ల రాజు, కొలను వాసుదేవ్, లిం గయ్య, మేకల నరసింహ తదితరు లు పాల్గొన్నారు.