Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Banakacharla Project : బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకొని తీరుతాం 

–బిఆర్ఎస్ నేతలు అపోహలు సృష్టిస్తున్నారు

–నమ్మశక్యం కానీ మాటలతో ప్రజ ల్లో గందరగోళంకు తెరలేపారు

–బనకచర్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు

— భారీ నీటిపారుదల పౌరసరఫ రా ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Banakacharla Project : ప్రజా దీవెన, కోదాడ: బనకచర్ల ప్రా జెక్టును ముమ్మాటికీ అడ్డుకుని తీ రుతామని రాష్ట్ర నీటిపారుదల, పౌ ర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు. నిర్మా ణాన్ని అడ్డుకునేందుకు కేంద్రం వద్ద, అధికారుల వద్ద వాదనలు వినిపిం చడంతో పాటు న్యాయ పోరాటం తో నిలువరిస్తామన్నారు.బనకచర్ల నిర్మాణంతో పాటు ఆల్మట్టి ఎత్తుపెం చే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేద న్నారు.కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సంగతన్ సృజన్ అభియాన్ కార్య క్రమంతో పాటు డి.సి.సి అధ్యక్ష ని యామకానికి గాను హుజుర్ నగర్, కోదాడ నియోజకవర్గాల ముఖ్యకా ర్యకర్తల సమావేశాన్ని బుధవారం సాయంత్రం కోదాడ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించారు.

ఏ.ఐ.సి.సి పరిశీలకుడు సారత్ రౌత్ ,స్థానిక శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ,జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు చెవిటి వెంకన్న యాద వ్,డి.సి.సి డెలిగేట్లు సి.హెచ్ లక్ష్మీ నారాయణ రెడ్డి,దొంగరి వెంకటే శ్వ ర్లు,వంగవీటి రామారావు తదితరు లు పాల్గొన్న ఈ సమావేశంలో మం త్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడు తూ ప్రజల్లో గందరగోళం సృష్టించేం దుకే బిఆర్ఎస్ తప్పుడు ప్రచారాని కి పునుకుందని విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం బ నకచర్ల నిర్మాణాన్ని గట్టిగా ప్రతిఘ టిస్తుందన్నారు.కేంద్ర జలశక్తి మంత్రి కి లేఖల ద్వారా మాత్రమే కాకుండా స్వయంగా కలసి తెలంగాణా కున్న అభ్యంతరాలను వివరించామన్నా రు.అంతే గాకుండా కృష్ణా పరివా హక ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలన్ని వ్యతిరేకిస్తూన్నయన్నారు.

ఆల్మట్టి ఎత్తు పెంచాడాన్ని ఎట్టి పరి స్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేద ని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, మహా రాష్ట్రలో బిజెపి, ఆంద్రప్రదేశ్ లో తె లుగుదేశం ప్రభుత్వం ఉన్నా ఉపే క్షించేది లేదని ఆయన తెలిపారు.

కృష్ణా జలాశయాలలో తెలంగాణా హక్కులను కాపాడేందుకు చిత్తశు ద్ధితో ఉన్నామన్నారు.

ట్రిబ్యునల్ తో పాటు సుప్రీంకోర్టు లో న్యాయ పోరాటం చేస్తున్న వి షయాన్ని ఆయన గుర్తుచేశారు. అంతే గాకుండా స్వయంగా తాను ట్రిబ్యునల్ కు హాజరయ్యానని, నీ టి వివాదాలలో ఒక మంత్రి ట్రిబ్యు నల్ లో హాజరు కావడం ఇదే మొ దటి సారి అని ఆయన తెలిపారు. కృష్ణా జలాశయాల పరిరక్షణ కోసం కమిట్మెంట్ ఉన్నందునే తాను స్వ యంగా హాజరు అయ్యానన్నారు.

కృష్ణా జలాశయాలను అప్పనంగా ఆంద్రప్రదేశ్ కు అప్పగించేందే నాటి బిఆర్ఎస్ పాలకులని విరుచుకుప డ్డారు.

811 టి.యం.సి ల నీటిని ఆంద్రప్ర దేశ్ కు కేవలము 299 టి యం సి ల నీటిని తెలంగాణా కేటాయిస్తూ ఒప్పందం కుదుర్చుకున్న ఘనత బి ఆర్ఎస్ పాలకులదని ఆయన మం డిపడ్డారు.బి.ఆర్.ఎస్ పాలనలో నీ టి పారుదల రంగంపై కోటి 80 వేల కోట్లు ఖర్చు పెట్టినా సాధించిన ప్ర యోజనం ఏమి లేదని ఆయన ఎ ద్దేవా చేశారు.

కాళేశ్వరంతో సాగులోకి వచ్చిన ఆ యకట్టు నామమాత్రమే నని, పాల మూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజె క్టు ల మీద పెట్టిన ఖర్చు నిష్ప్రయో జనంగా మారిందని ఆయన విమ ర్శించారు.పెండింగ్ ప్రాజెక్టులన్నిం టినీ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎస్.ఎల్.బి.సి ని పూర్తి చే స్తామని ఆయన చెప్పారు.

 

బి.ఆర్.ఎస్ పాలనలో కల్వకుర్తి, దే వాదుల,నెట్టేంపాడు, భీమా, కోయి ల్ సాగర్,బ్రాహ్మణ వెళ్ళేంల ప్రాజెక్టు లు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నా రు.డిండి ప్రాజెక్టు కు నీటి కేటాయం పులే జరగలేదన్నారు.ప్రస్తుత ప్రభు త్వం డిండి ప్రాజెక్టు కు నిధులు కేటా యించి పనుల వేగవంతం చేస్తు న్నామన్నారు.సూర్యాపేట జిల్లాకు దేవాదుల నీటిని పారించాలి అన్న దే ప్రభుత్వ సంకల్పమన్నారు.

ధాన్యం దిగుబడి లో తెలంగాణా సంచలన విజయాలను నమోదు చేసుకుందన్నారు.తెలంగాణా రా ష్ట్రం ఏర్పడ్డాక పదేళ్లుగా లేని దిగు బడి ఈ రెండేళ్ళలో వచ్చిందన్నా రు. యావత్ భారత దేశంలోనే ఈ అరుదైన రికార్డు నమోదు అయ్యిం దంటే అందుకు వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అ నుసరించిన విధానాలే కారణమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొ న్నారు.