Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Why are the farmers so upset.. రైతులంటే అంత అక్కసెందుకు…!

రాహుల్ గాందీ కి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్న

రైతులంటే అంత అక్కసెందుకు…!

రాహుల్ గాందీ కి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్న

ప్రజా దీవెన/హైదరాబాద్: బి అర్ ఎస్ ప్రభుత్వం తెలంగాణ రైతులకు(formars )అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తును రద్దు చేస్తామని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. తెలంగాణ రైతాంగం పై ఎందుకంత అక్కసు వెళ్ళగకుతున్నారని, ఎందుకు కక్ష కట్టారని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (rahul gandhi)సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత(kavitha)మేరకు తన ట్విట్టర్ లో పోస్ట్ రాశారు.

రైతులకు ఉచితంగా 24 గంటల పాటు నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తే కాంగ్రెస్ కి వచ్చిన సమస్య ఏమిటని ప్రశ్నించారు. కేవలం మూడు గంటల పాటు రైతులకు విద్యుత్తు ఇస్తే సరిపోతుందని పిసిసి అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు చూసి తనతో పాటు రైతులు సంబ్రమాశ్చర్యానికి గురి అయ్యే పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.

“రాహుల్ గాంధీ గారు…. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు అందించలేక పోతున్నారన్న కారణంతో తెలంగాణ రైతాంగాన్ని కూడా మీరు ఇబ్బందులపాలు చేయాలనుకుంటున్నారా ??” అని అడిగారు. బీఆర్ఎస్ (brs)పార్టీ రైతుల ప్రయోజనాలను కాపాడుతుందని, ప్రతి రైతుకు తాము అండగా నిలబడుతామని కవిత స్పష్టం చేశారు.