Woman Gang Rape: ప్రజా దీవెన, బెంగుళూరు: కర్నా టకలో ఇద్దరు మహిళలపై సామూ హిక అత్యాచారం జరిగింది. 27 ఏళ్ల ఇజ్రాయిల్ పర్యాటకులరా లితో పాటు ఓ హోమ్‌స్టే ఓనర్‌పై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. కొప్పా ల్‌లో ఉన్న తుంగభద్ర కెనాల్ వద్ద గురువారం రాత్రి ఈ ఘటన జరిగిం ది. దాడికి పాల్పడ్డ నిందితులు మ హిళలతో కలిసి ఉన్న మరో ముగ్గు ర్ని కాలువలోకి తోసివేశారు. అమె రికాకు చెందిన డేనియల్, మహా రాష్ట్ర పర్యాటకుడు పంకజ్‌లు కా లువ నుంచి ప్రాణాలతో బయటకు వచ్చారు. అయితే ఒడిశాకు చెం దిన బిబాష్ అనే వ్యక్తి ఆచూకీ లే దు. నిందితుల్ని త్వరలో అరెస్టు చేయనున్నట్లు పోలీసులు వెల్లడిం చారు. సామూహిక అత్యాచారానికి గురైన ఇద్దరు మహిళలు ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందు తున్నారు.
డిన్నర్ చేసి తుంగభద్ర లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ వద్ద విహారానికి వెళ్లిన సమయంలో బైక్‌పై వచ్చిన వ్యక్తులు తమపై దాడి చేసినట్లు హోమ్‌స్టే ఓనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నది. పెట్రోల్ ఎక్కడ దొరు కుతుందని అడిగారని, ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేశారని చెప్పిం ది. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరిం చడంతో, వాళ్లు పర్యాటకులపై దా డి చేశారని, మహిళల్ని రేప్ చేసి న ట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నేరా నికి పాల్పడిన తర్వాత బైక్‌పై పారి పోయినట్లు చెప్పారు. పర్యాటకు ల్లో ఇద్దరు విదేశీయులు ఉన్నారని, దాంట్లో ఓ ఇజ్రాయిలీ మహిళ ఉన్న ట్లు కొప్పాల్ ఎస్సీ రామ్ అరసిద్ది తెలిపారు.అగ్నిమాపక సిబ్బంది, పోలీసు డాగ్ స్వ్కాడ్ మిస్సింగ్ టూరిస్టు గురించి వెతుకుతున్నా రు.
అత్యాచారానికి గురైన మహి ళలు ఆస్పత్రిలో కోలుకుంటు న్నా రు. వాళ్లను ప్రైవేటు ఆస్పత్రికి తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళలు ఇచ్చిన ఫిర్యాదు ధారంగా.. రేప్, గ్యాంగ్ రేప్, దొంగతనం కేసు బుక్ చేశారు. నిందితుల్ని గుర్తించామని, రెండు స్పెషల్ టీమ్స్ దర్యాప్తు చేపడుతు న్నట్లు తెలిపారు.