
— నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్ర శేఖర్
District Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: సావిత్రిబా యి పూలే స్ఫూర్తితో మహిళా విద్య కు కృషి చేయాల్సిన అవసరం ఉం దని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అ న్నారు. సావిత్రిబాయి పూలే 159 వ జయంతిని పురస్కరించుకొని శ నివారం జిల్లా విద్యాశాఖ ఆధ్వ ర్యంలో కలెక్టర్ కార్యాలయ సమా వేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అ తిథిగా హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలు వేసి ని వాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ సావిత్రి బాయి పూలే స్ఫూర్తితోనే భారత రాజ్యాంగంలో విద్యా హక్కు చట్టం, సమానత్వ చట్టాలు పొందుపరచ డం జరిగిందని అన్నారు.ప్రత్యేకించి మహిళా విద్య కోసం ఆమె చేసిన కృషిని దృష్టిలో ఉంచుకొని ప్రభు త్వాలు మహిళ విద్యకు అనేక కా ర్యక్రమాలు చేపడుతున్నాయని, ప్ర త్యేకించి రాష్ట్ర ప్రభుత్వం బాలిక వి ద్యకు ప్రత్యేక పాఠశాలలను నెలకొ ల్పిందని, అలాగే మహిళా, శిశు సం క్షేమ శాఖ ద్వారా బాలికలు మహిళ ల అభ్యున్నతికి కార్యక్రమాల నిర్వ హణతో పాటు, బాలికలు మధ్య లోనే బడిమాని వేయకుండా చూడ టం, మహిళా అక్షరాస్య పెంపు కై ఉ ల్లాస్ వంటి పథకాలను అమలు చే యడం జరుగుతున్నదన్నారు.
18 సంవత్సరాలు పైబడిన మ హి ళలు చదువు నేర్చుకునే విధంగా ప్రోత్సహించడం జరుగుతున్నదని, స్వయం సహాయక మహిళా సం ఘాలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేసల్యాడం జరుగుతున్నదని, మ హిళలని చైతన్యం చేయాలన్న ఉద్దే శంతో సావిత్రి బాయిపూలేను స్ఫూ ర్తిగా తీసుకొని వీటన్నిటిని అమలు చేస్తున్నారని, అందువల్ల సావిత్రిబా యి పూలే స్ఫూర్తితో ముందుకు వె ళ్లాలని తెలిపారు.
బ్రిటిష్ పరిపాలన కాలంలో అనేక ర కాల సామాజిక రుగ్మతలు సమా జంలో ఉండేవని, సతీ సహగమ నం, బాల్య వివాహల వంటి వాటిని వ్యతిరేకిస్తూ జ్యోతిబా పూలే చేప ట్టిన సామాజిక ఉద్యమంలో సావి త్రిబాయి పూలే భాగస్వామి అయి సామాజిక కార్యకర్తగా పని చేశారని అన్నారు. ముఖ్యంగా విద్యకు ప్రధా న్యత ఇచ్చారని తెలిపారు. జ్యోతి బాపూలే స్థాపించిన “సత్య శోధన” ద్వారా దేశవ్యాప్తంగా మహిళా వి ద్య, సంఘసంస్కరణలపై అ వగా హన కల్పించారని ఆయన పేర్కొ న్నారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీని వాస్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళా విద్య కోసం చేసిన కృషిని కొనియాడారు. మహిళకు విద్య ఉన్నప్పుడే సామాజిక సమ స్యలు తొలగిపోతాయని, సమాజా న్ని ఎదిరించి మహిళలను చదివిం చి విద్యాలయాలు ఏర్పాటు చేసి మహిళా అభ్యున్నతికి ఆమె పాటు పడ్డారని, వారిని ఆదర్శంగా తీసు కొని ప్రభుత్వం బాలికలకు ప్రత్యేక పాఠశాలలు ,ఆత్మ రక్షణ కార్యక్ర మాలను నిర్వహించారన్నారు.
విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్ ,జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి ,జిల్లా బీసీ సంఘం అధ్య క్షులు చక్రహరి రామరాజు, దుడుకు లక్ష్మీనారాయణ, మిర్యాల యాద గి రి, వెంకటేశ్వర్లు, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పరమేష్, పలువురు ఉపాధ్యాయులు మాట్లా డారు. ఈ సందర్భంగా మహిళా ఉ పాధ్యాయులను జిల్లా కలెక్టర్ స న్మా మనించారు.





