–ఏఐటియుసి కార్యదర్శి పల్లా దే వేందర్ రెడ్డి
Palla Devender Reddy : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నేష నల్ హెల్త్ మిషన్ నందు ఏఎన్ఎం లుగా పనిచేస్తున్న వారికి ఆన్లైన్ యాఫ్ ల వల్ల తీవ్రమైన పని ఒత్తి డిని ఎదుర్కొంటున్నారని తక్షణమే వాటిని రద్దు చేయాలని ఏఐటియు సి రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఏఐటీ యూసీ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వ హిoచి అనంతరం జిల్లా కలెక్టర్ ఇ లా త్రిపాఠి కి వినతిపత్రం అందజే శారు.
ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ వాస్త వానికి గ్రామీణ ప్రాంతాలలో ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసు కో వటానికి, అంటువ్యాధులు ప్రబల కుండా కావలసిన జాగ్రత్తలు తీసు కోవడానికి, ఆరోగ్యం మెరుగు పడ టానికి కావలసిన ముందస్తు జాగ్ర త్తలతో పాటు అవగాహన కల్పిం చ డానికి, చిన్నపిల్లలకు టీకాలు వేయ డానికి ఏఎన్ఎంలుగా ఉద్యో గంలో కి తీసుకున్నారనీ, మారుతున్న పరి స్థితులరిత్యా గత కొంతకాలంగా ఏ ఎన్ఎం లు చేసిన పనులకు సంబం ధించిన కొన్ని రిపోర్టులను ఆన్లైన్ ద్వారా పంపించాలని 2016వ సం వత్సరంలో తెలియజేశారు.
ఒకటి రెండు యాపులతో ప్రారంభ మైన ఆన్లైన్ పనులు ప్రస్తుతం దా దాపు 14 మొబైల్ అప్లికేషన్స్ (యా ప్ ) లను పూర్తి చేయాల్సి వస్తుంది. ఇందులో ముఖ్యమైన కొన్ని యాప్ లలో 20 నుండి 30 కాలమ్స్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ము ఖ్యంగా యువిన్ యాప్ అప్లోడ్ కి సంబంధించి రాత్రి 11 గంటల నుం డి 1గం ల మధ్యలోనే పనిచేస్తుంద నీ ఆవేదన చెందారు. రాత్రి అంతా మేల్కొని పనిచేయాల్సి వస్తుందనీ ఇక ఎన్ సి డి విషయానికొస్తే ప్రతి వ్యక్తిని స్క్రీనింగ్ చేయడంతో పాటు ఆ వ్యక్తికి సంబంధించిన ప్రతి అంశా న్ని ఆన్లైన్ చేయవలసి వస్తుందన్నా రు. అంటే దాదాపు ఒక వ్యక్తికి సం బంధించి అర్ధగంట సమయం కే టాయించవలసి వస్తుందనీ అన్నా రు. మొత్తం పాపులేషన్ లో 35 శాతం మందికి ఎన్సీడీ చేయాలని ఏఎన్ఎం లకు టార్గెట్ విధించారు.
ఒకవైపు ఆఫ్లైన్ మరొకవైపు ఆన్లైన్ వర్కులు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనీ ఆరోపించారు.
ముఖ్యంగా హై బీపీ, లో బిపి, షు గర్, స్పాంట్లైటిస్, లతోపాటు కంటి చూపు కోల్పోవడం వంటి శారీరిక ఇబ్బందులతో పాటు అనేక మాన సిక రుగ్మతలకు కూడా గురవుతు న్నారనీ ఆవేదన చెందారు.ఆన్లైన్, ఆ ఫ్లైన్ రెండు పనులు చేయిస్తున్నా రు.ఆన్లైన్ చేశాం కదా అని రికార్డు లు రాయకపోతే తనిఖీల పేరుతో సబ్ సెంటర్లకు వచిన అధికారులు మెమోలు ఇస్తామని, సస్పెండ్ చే స్తామని బెదిరిస్తున్నారనీ అన్నారు. ఆన్లైన్ వర్క్స్ నుండి ఏఎన్ఎం లం దరికీ మినహాయింపు ఇవ్వాలని ఆ యన డిమాండ్ చేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటీ యూసీ జిల్లా ఉపాధ్యక్షులు కేఎస్ రెడ్డి, డివిజన్ కార్యదర్శి విశ్వ నా ధులు లెనిన్, ఏఎన్ఏం ల యూని యన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ గీతారాణి, కోశాధికారి ఎస్. పద్మ , సరిత, భవాని, శారద, ఎస్. రేణుక, నాగమణి, సిహెచ్. సరిత, హైమావ తి, బి. హరిత, ఏం. నిర్మల, శిల్ప, మాధురి, అనిత, సునీత, జ్యోతి, జీ. సులోచన, ఎస్. పద్మ, రుక్సా నా, అన్నమ్మ, వై. శోభారాణి, విజ యలక్ష్మి, జీవిత, నాగలక్ష్మి, నిర్మల, కౌసల్య, ఉమారాణి, స్వాతి, సాల మ్మ, ధనలక్ష్మి, తదితరులు పాల్గొ న్నారు.