–ఏపి లో వైసిపి కార్యాలయాల కూ ల్చివేతలపై హైకోర్టు మధ్యంతర ఉ త్తర్వులు
–అనుమతుల రికార్డ్ లు విధిగా చూపాలంటూ వైసిపికి అదేశం
YCP Offices:ప్రజా దీవెన, అమరావతి: ఆంద్రప్రదేశ్ లో వైసీపీ కార్యాలయా లు (YCP Offices) కూల్చివేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషన్ల పై విచారణ చేపట్టింది ఏపీ హైకోర్టు(AP High Court). విచారణ చేపట్టిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేతల్లో చట్టపరమైన ని బంధనలు పాటించాలని సూచిం చింది. అలాగే, ప్రతి దశలోనూ వైసీపీ (YCP Offices)తరపున వాదనలు వినిపించేం దుకు అవకాశం ఇవ్వాలని పేర్కొం ది. అదే సందర్భంలో 2 నెలల్లో భవనాల అనుమతులు, ఆధారాలు, రికార్డులు అధికారుల (Records are official)ముందు ఉంచాలని వైసీపీని న్యాయ స్థానం ఆదేశించింది. తగినంత సమయం ఇచ్చి వివరణ తీసుకున్నాక కట్ట డాల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించడం జరిగింది. ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా, ప్రమాదకరంగా ఉంటే త ప్ప కూల్చివేత వంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు మూసివేసింది.