Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Yogi Adityanath: దేశ వ్యతిరేకంగా పోస్టులు పెడితే జీవితాంతం జైలుకే

–యూపీ లో యోగి సర్కార్ కొత్త చట్టం
–కొత్త సోషల్ మీడియా పాలసీకి ఆమోదం తెలిపిన ప్రభుత్వం
–దేశ వ్యతిరేక కంటెంట్‌కు యావ జ్జీవ కారాగార శిక్ష
–ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ కంటెంట్‌పై ఆంక్షలు

Yogi Adityanath: ప్రజా దీవెన, లక్నో: దేశం లో ప్రస్తుతం సోషల్ మీడియా ఉప యోగం విపరీతంగా పెరిగిపో యింది. ఎక్కడ ఏం జరిగినా మీడి యా కంటే ముందే సోషల్ మీడి యాలో వైరల్ అవుతోంది. ఏ మూ లన జరిగినా క్షణాల్లో ప్రపంచం మొ త్తం వ్యాపిస్తోంది. అయితే ఇది ఒక రకంగా మంచిదే అయినా చాలా వరకు సోషల్ మీడియాను దుర్వి నియోగం అవుతోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమం లోనే కొందరు ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతూ కేసుల పాలై జైళ్లకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నే తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సర్కార్ సరికొత్త చట్టా న్ని తీసుకువచ్చింది. దేశానికి వ్యతి రేకంగా పోస్టులు పెడితే వారిని జీవి తాంతం జైలులోనే ఉండేలా కఠిన చట్టానికి యూపీ కేబినెట్ (cabinet)ఆమోదం కల్పించింది.ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌ స్టాగ్రామ్, యూట్యూబ్‌ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో దేశ వ్యతిరేక కంటెంట్‌ను నియం త్రించాలనే లక్ష్యంతో తీసుకువచ్చిన కొత్త సోషల్ మీడియా (Social media) పాలసీకి ఉత్తర్‌ప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అభ్యంతరకరమైన సోషల్ మీడియా కంటెంట్‌ను నిరోధించడానికి ఈ పాలసీలో కొన్ని మార్గదర్శకాలను యోగి ఆదిత్య నాథ్ సర్కార్ రూపొందించింది. ఈ కొత్త సోషల్ మీడియా విధానం ప్రకారం..

దేశ వ్యతిరేక కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వ్యాప్తి చేయడాన్ని తీవ్రమైన నేరం గా యూపీ ప్రభుత్వం పరిగణిం చింది. ఇలాంటి కంటెంట్ వల్ల తక్కువలో తక్కువ 3 ఏళ్ల జైలు(jail) శిక్ష విధించనున్నారు. అంతేకాకుండా గరిష్ఠంగా జీవిత ఖైదుతోపాటు భారీగా జరిమనాలు విధించే అవకాశం ఉంది. ఇంతకుముందు ఇలా సోషల్ మీడియాలో దేశవ్యతిరేక వార్తలను పోస్ట్ చేసేవారిపై గోప్యతా ఉల్లంఘనలు, సైబర్ టెర్రరిజంతో వ్యవహరించే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 66E, 66F సెక్షన్ల కింద నమోదు చేసే వారు.ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అశ్లీలత లేదా పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచారం చేసేవారిపై క్రిమినల్ కేసులు పెట్టే అవకాశాన్ని ఈ కొత్త సోషల్ మీడియా పాలసీలో యోగి సర్కార్ రూపొందించింది. అంతేకాకుండా ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కంటెంట్‌పై చట్టపరంగా ఎదుర్కొనేందుకు ఈ కొత్త విధానం ఎంతో ఉపయోగపడనుంది. ఈ మేరకు సోషల్ మీడియా కంటెంట్‌ని పరిశీలించే బాధ్యతలను వీ-ఫోరమ్ అనే డిజిటల్ ఏజెన్సీకి ఉత్తర్‌ప్రదేశ్ (up)ప్రభుత్వం అప్పగించింది. సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యే వీడియోలు, ట్వీట్‌లు, పోస్ట్‌లు, రీల్స్‌పై ఈ వీ -ఫోరమ్ సంస్థ నిఘా పెట్టనుంది.

ఇక సోషల్ మీడియా సైట్ల ద్వారా చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు నెలకు లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. అయితే ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల ఆదాయంపై యోగి సర్కార్ ఆంక్షలు విధించింది. ట్విటర్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోని ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు నెలకు రూ.5 లక్షలు.. రూ.4 లక్షలు, రూ.3 లక్షలకు మించి చెల్లింపులు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇక యూట్యూబ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు నెలకి రూ.8 లక్షలకు మించి డబ్బులు చెల్లించడానికి వీలు లేకుండా ఆంక్షలు విధించింది. వీడియోలకు గరిష్ఠంగా రూ.8 లక్షలు మాత్రమే చెల్లించాలని తేల్చి చెప్పింది.