–కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ
MLA Uttam Padmavathi : ప్రజా దీవెన, కోదాడ: యువతి యువకులు స్వయం ఉపాధిని ఎన్నుకొని రాణించాలని కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి అన్నార పట్టణంలోని సోమవారం కోదాడలోని ఖమ్మం క్రాస్ రోడ్ కరెంట్ ఆఫీస్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన కాఫీ కేఫ్ ను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత వ్యాపార రంగములు తమకున్న నైపుణ్యాన్ని ఉపయోగించి వ్యాపారంలో రాణించి పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలన్నారు.
నమ్మకమైన సేవలందించి వినియోగదారుల మన్ననలు పొందాలన్నారు. అనంతరం కేఫ్ నిర్వాహకులు ఎండి జానీ పాషా కు శుభాకాంక్షలు తెలుపుతూ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు షేక్ షఫీ, దండా వీరభద్రం, ఉద్దండు తదితరులు పాల్గొన్నారు.