Youtuber Harsha Sai: ఒక్కడపుడూ రోడ్లపై డబ్బులు చల్లుతూ జనాలని పిచ్చోళ్లను చేస్తూ ఒక యూట్యూబర్ జైలు (jail)కెళ్ళిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. సర్ప్రైజింగ్ కాష్ గిఫ్ట్ (Surprising cash gift)తో మరొకరు సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇద్దరు కూడా యూట్యూబర్ క్రియేటర్ లే.. సోషల్ మీడియాలో ప్లాపులారిటీ కోసం వింత వింత పనులు చేసేవారు ఎందరో ఉన్నారు. ఈ క్రమంలో ప్రముఖ యూట్యూబర్ అయిన హర్ష సాయి పాన్ ఇండియా సినిమాలో కూడా నటించే అవకాశం వచ్చింది. అయితే ప్రస్తుతం హర్ష సాయి పై నర్సింగి పోలీస్ స్టేషన్లో రేప్ కేసు తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది.. అయితే పాన్ ఇండియా సినిమా సంగతేమో కానీ ఇలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కాస్త హర్ష సాయి డర్టీ పిక్చర్ మొదలైపోయింది.
హర్ష సాయి (Harsha Sai) తనను పెళ్లి చేసుకుంటారని నమ్మించి మోసం చేశాడని బిగ్ బాస్ (bigg boss)ఓటిటి మాజీ కంటెస్టెంట్ పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు నమోదు చేసింది. అంతేకాకుండా తన దగ్గర రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఇప్పుడు ఆది అడుగుతే మొఖం చాటేస్తున్నాడు అంటూ నర్సింగ్ పిఎస్ (police station)లో కంప్లైంట్ చేశారు. అంతేకాకుండా తన పర్సనల్ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బ్లాక్మెయిల్ (Blackmail)చేస్తున్నారని హాస్య సాయి అతని తండ్రి పై ఫిర్యాదు చెయ్య సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలియజేశారు. ఇది ఇలా ఉండగా వైద్య పరీక్షల కోసం బాధితురాల్ని హాస్పిటల్ కు తరలించారు.
అయితే మరోవైపు సామాన్యులకు ఆర్థిక సహాయం చేస్తూ మానవత్వం చూపిస్తే ఎలాగా వీడియోలలో యూట్యూబర్ గా పాపులారిటీ ఆయన హర్ష సాయి అంత డబ్బు అతనికి ఎక్కడి నుంచి వస్తుందా అని, అక్రమ బైటింగ్ యాప్లను (Illegal baiting apps) నిర్వహిస్తాడని ఆరోపణలు కూడా చాలానే వచ్చాయి. ఇక ఇది ఇలా ఉండగా మరోవైపు సోషల్ మీడియాలో (Social media) ఇక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు విషయానికి వస్తే అసలు వారి కహాని ఎక్కడి నుంచి మొదలైంది..? వారిద్దరి పరిచయం ఎక్కడ..? అంటూ పలు చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటికి హర్ష సాయి స్పందించలేదు. బాధితురాలు ఫిర్యాదు మేరకు వైడ్ యాంగిల్ లో ఎంక్వయిరీ చేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలియచేస్తున్నారు.