Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Yrcpleadersarrests : వైసిపికి వరుస అరెస్టులతో ఉక్కిరి బిక్కిరి

వైసిపికి వరుస అరెస్టులతో ఉక్కిరి బిక్కిరి

Yrcpleadersarrests: ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ నాయకుల వరుస అరెస్టులతో ఆ పార్టీ ఉక్కిరి బి క్కిరి అవుతుంది. ఓ మహిళతో అసభ్యకరంగా వీడియో కాల్ చే సిన మాజీ ఎంపీ మాధవ్ పై కేసు పెట్టిన వాసిరెడ్డి పద్మతో వైసీపీ కీలక నే తలకు వరుసగా ఎదురుదె బ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే వల్ల భనేని వంశీ, పోసాని కృష్ణము రళి, నందిగం సురేశ్ వంటి నేతలు కేసుల్లో బుక్ అయ్యారు.

తాజాగా వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధ వ్ వంతు వచ్చినట్టుంది. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన మాధవ్ కు భారీ షాక్ తగిలింది. గోరంట్ల మాధ వ్ ఒక మహిళతో వీడియో కాల్ లో అసభ్యకరంగా వ్యవహరించిన సం గతి అందరికీ తెలిసిందే. ఈ వ్యవ హారంపై ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదయింది. 2024 నవంబర్ 2న మాధవ్ పై వాసిరెడ్డి పద్మ ఫి ర్యాదు చేశారు.

ఈ క్రమంలో మాధ వ్ ఇంటికి పోలీసులు వెళ్లారు. మార్చి 5న విచా రణకు హాజరు కావాలంటూ సైబర్ క్రైమ్ పోలీసు లు నోటీసులు ఇచ్చారు. మాధవ్ పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆయనపై బీఎన్ఎస్ సెక్షన్లు 72, 79 కింద కేసు బుక్ చేశా రు. తమ ముందు విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని పోలీ సు లు నోటీసుల్లో పేర్కొన్నారు.