–రాజశేఖర్ రెడ్డి సేవలను స్మరించుకున్న సీఎం
–నిజమైన వారసులు కాంగ్రెస్ లోకి రావాలని పిలుపు
Ys Rajashekhar Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Ys Rajashekhar Reddy) సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శ మని తెలంగాణ ముఖ్యమoత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (revanth Reddy)పేర్కొన్నారు.గాంధీ భవన్ లో (Gandhi bhavan)సోమవారం జరిగి న వైఎస్సార్ జయంతి వేడు కలలో ఆయన పాల్గొన్నారు. భవన్ లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభిం చారు. ఈ సందర్బంగా రేవంత్ (revanth)మాట్లాడుతూ వైఎస్సార్ ముద్ర ప్రజల గుండెల్లో భద్రంగా ఉంద న్నారు. సంక్షేమం అంటే వైఎస్సార్ (YSR)గుర్తుకొస్తారని చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు వైఎస్సార్ సంక్షే మమే స్ఫూర్తి అని అన్నారు. వైఎ స్సార్ భౌతికంగా ప్రజల మధ్య లేకున్నా ఆయన స్ఫూర్తి బతికే ఉంటుందన్నారు. వైఎస్ అకాల మరణం కాంగ్రెస్ కు తీరని లోట న్నారు. వైఎస్సార్ నిజమైన వార సులు కాంగ్రెస్ లో కి రావాలని సూచించారు. వైఎస్సార్ ఆశ యాలను కొనసాగిస్తాని తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి వైఎస్సార్ ఎంతో కృషి చేశారని చెప్పారు. రాహుల్ (Rahul) జోడో యాత్రకు వైఎస్సార్ పాదయాత్ర స్ఫూర్తి అని వెల్లడించారు.ప్రధాని పదవికి ఒక్క అడుగు దూరంలో రాహుల్ ప్రధాని పదవికి రాహుల్ ఒక్క అడుగు దూరంలో ఉన్నారని చెప్పారు సీఎం రేవంత్. రాహుల్ ను ప్రధానిని చేసే వరకు కార్యకర్తలు కష్టపడాలని కోరారు. రాహుల్ ప్రధాని అయితేనే పేదలకు మేలు జరుగుతుందన్నారు.రాహుల్ ను ప్రధాని చేయడమే లక్ష్యమని వైఎస్సార్ చెప్పారన్నారు.
*పంజాగుట్టలో* ..దివంగత వైఎస్సార్ జయంతి సందర్భంగా పంజాగుట్టలోని వైఎస్ఆర్ విగ్ర హానికి (YSR statue)పూలమాలలు వేసి నివా ళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకు న్నారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (batti vikramarka)మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి అ ధ్వాన్నంగా ఉన్నప్పటికీ రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ పై వెనక్కి తగ్గేది, మాట తప్పేది లేదని మడ మ చెప్పేది లేదని లేదని స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామ న్నారు. ఆగస్టు 15 లోపు రుణమా ఫీ చేసి తీరుతామని స్పష్టం చేశా రు. వైఎస్ఆర్ (YSR)75 జయంతి సంద ర్భంగా గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భట్టి పాల్గొని మాట్లాడారు. ఇతర పార్టీల నాయ కులు పెద్ద ఎత్తున తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారని ఈ చేరికల పరిణామమే రాష్ట్ర ప్రభుత్వం బాగా పని చేస్తోందనడానికి నిదర్శనం అన్నారు.
ఇక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల న్నింటినీ తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఇవాళ తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధిలో దూసు కుపోతున్నదంటే దానికి వైఎస్ఆర్ హయాంలో చేపట్టిన ఓఆర్ఆర్, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, ఇతర మౌళిక సదుపాయాలే కారణం అన్నారు. వైఎస్ (Ys)దీర్ఘకాలిక పునాదుల వల్ల ప్రపంచ దేశాలు హైదరాబాద్ వైపు చూస్తు న్నాయన్నారు. వైఎస్ పాలన చిరస్థాయిగా నిలుస్తుందని, వైఎస్ ఆలోచన మార్గంలో తమ ప్రభు త్వం పని చేస్తుంద న్నారు. రాష్ట్రం లో రాబోయే రెండు దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పని చేయడం కోసం వైఎస్ అభి మానులు, కాంగ్రెస్ శ్రేణులు అంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని భట్టి అన్నారు. వివిధ కారణాలతో పార్టీకి దూరమైన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైఎస్ అభిమానులు, పాత తరం కాంగ్రెస్ నాయకులంతా తిరిగి కాంగ్రెస్ లో చేరాలని ఆయన పిలు పు ఇచ్చారు.
ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఏపీ కాంగ్రెస్ అధ్య క్షురాలు వైఎస్ షర్మిల నివాళి అర్పించారు. తల్లి విజయమ్మ, భర్త అనిల్ కుమార్, కుమారుడు, కోడలు, కుమార్తెతో కలిసి అక్కడికి వెళ్లారు. జగన్ ( Jagan)వెళ్లిన అరగంట తర్వాత ఆమె వైఎస్ఆర్ ఘాట్‌కు వచ్చారు.ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత జగన్ నివాళులర్పించారు. వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మ, సతీమణి భారతితో కలిసి పుష్పాంజలి ఘటించారు. తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. వారితో వైఎస్ విమలమ్మ ( vijayamma) ప్రత్యేక ప్రార్థనలు చేయించారు.
కడప: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత జగన్ ( jagan)నివాళులర్పించారు. వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మ, సతీమణి భారతితో కలిసి పుష్పాంజలి ఘటించారు. తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. వారితో వైఎస్ విమలమ్మ ప్రత్యేక ప్రార్థనలు చేయించారు.