–హoతకులకు అండగా నిలిచిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి
–సిబిఐ అధికారులపై సైతం తప్పు డు కేసులు కూడా పెట్టారు
–ఏపీ హోo మంత్రి అనితతో వైఎస్ సునీత సుదీర్ఘ చర్చలు
YS Vivekananda Reddy: ప్రజాదీవెన, అమరావతి: ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితతో (Home Minister Vangalapudi Anita) వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత (sunitha) భేటీ అయ్యారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయంపై అనితకు సునీత వివరించారు. వివేకా హత్య తదనంతర పరిణామాలను హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు (Local police)హంతకులకు అండగా నిలిచారనీ, వారిపై చర్యలు తీసుకోవాలని సునీత కోరారు. కేసు విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు సాక్ష్యుల్ని బెదిరించి పోలీసులు కేసును నీరుగార్చే విధంగా వ్యవహరించారని తెలిపారు.
తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టం..
ప్రస్తుతం సీబీఐ (cbi) విచారణలో ఉన్న కేసుకు సంబంధించి సంపూర్ణ సహకారం ఉంటుందని అనిత భరోసా ఇచ్చారు. దోషులకు శిక్షపడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్న అనిత, తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టమని స్పష్టం చేశారు.