YSR Jayanti : ప్రజాదీవెన నల్గొండ టౌన్ : పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేసిన మహానీయుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. వైయస్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్గొండ మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖయ్యూం బేగ్, ఆల్లి సుభాష్ యాదవ్, జూలకంటి శ్రీనివాస్, బొజ్జ శంకర్, కత్తుల కోటి,వజ్జ రమేష్ యాదవ్, నాగేశ్వరరావు,ఇంతియాజ్, గంగుల సైదులు, పిల్లి రమేష్ యాదవ్, కిన్నెర అంజి, పిల్లి యాదగిరి యాదవ్, పెండెం రత్నమాల పాండు, ఉప్పునూతల వెంకన్న యాదవ్, గౌసుయుద్దీన్ , వడ్డేపల్లి కాశిరాం,జహంగీర్ బాబా, మామిడి కార్తీక్, గాలి నాగరాజు , పెరిక అంజయ్య, చింతపల్లి గోపాల్, పెరిక హరిప్రసాద్, పాదం అనిల్, దాసరి విజయ్ తదితరులు పాల్గొని వైయస్సార్ చిత్రపటానికి నివాళులర్పించారు.