–ఆకలి నివారణ కోసం ఆఫ్రికాతో జీటూజీ డీల్, కాకినాడ పోర్టు నుం చి నూక బియ్యం ఎగుమతులు
–వాటి నిలిపివేతతో ఒప్పందానికి దెబ్బoటూ కేంద్రం నుంచి ఎన్సీఈ ఎల్ లేఖ
ప్రజా దీవెన, అమరావతి: కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు ఎగు మతయ్యే నూకల విషయంలో అధికారులు తనిఖీల పేరుతో ఇక్క ట్లు కలిగించవద్దని రాష్ట్ర ప్రభు త్వానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషన ల్ కో ఆపరేటివ్ ఎక్స్ పోర్ట్స్ లిమి టెడ్ (ఎన్సీఈఎల్) విజ్ఞప్తి చేసింది. ప్రపంచంలోని ఆఫ్రికా దేశాల్లో ఆక లి నివారణ, అక్కడి ప్రజలకు ఆహా ర భద్రత కల్పించే ప్రక్రియలో భాగం గా భారత్ కు ఆఫ్రికాకు మధ్య కుది రిన గవర్నమెంట్ టు గవర్నమెంట్ (జీటూజీ) ఒప్పందంలో భాగంగా ఎగుమతి అవుతున్న బియ్యాన్ని తనిఖీల పేరుతో ఆటంక పరచవ ద్దు అని కోరింది. ఈమేరకు తాజా గా రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కాకి నాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ కు లేఖ రాసింది.
జీటూజీ ఒప్పందం లో భాగంగా కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు ఎన్సీ ఈఎల్ నూక బియ్యాన్ని ఎగుమతి చేస్తోందని ఆ సంస్థ సీఈవో అను పమ్ కౌశిక్ వివరించారు.ఇందులో ఫోర్టిఫైడ్ రైస్ ఆనవాళ్లు ఉన్నాయ నే కారణంతో కొంతకాలంగా బి య్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఎగుమతి చేయకుండా కాకి నాడ అధికారులు అడ్డుకోవడం తెలిసిందే. అయితే, అది సరికాదని లేఖలో ఎన్సీఈఎల్ తన లేఖలో పేర్కొంది. ఎగుమతులకు ఆటంకం వల్ల ఆఫ్రికాతో భారతదేశానికి కుది రిన జీటూజీ ఒప్పందానికి ఆటం కాలు కలుగుతున్నాయని అభ్యం తరం వ్యక్తంచేసింది.ఇదే విషయమై భారత విదేశీ వ్యవహారాలశాఖ తరచూ ఎన్సీఈఎల్ కు మెయిల్స్, ఫోన్లు చేస్తూ ఎగుమతులు ఆగడం పై ప్రశ్నిస్తోందని ఆ లేఖలో ప్రస్తావిం చింది.వాస్తవానికి రాష్ట్రప్ర భుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యా న్ని మర ఆడించడానికి మిల్లులకు ఇస్తుందని, ఇలా ఆడగా వచ్చే బియ్యాన్ని ఎల్సీఐకు అప్పగించే క్రమంలో కొంత బియ్యం తిరస్కర ణకు గురవుతాయని లేఖలో వివ రించింది.ఇలా తిరస్కరణకు గురైన బియ్యాన్ని మిల్లులు నూకగా ఆడించి బహిరంగ మార్కెట్లో విక్ర యిస్తాయని, అవే నూకలను కేంద్రం తరఫున తాము ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తుంటామని వివరించింది.
అయితే ఈ నూకల్లో ఫోర్టిఫైడ్ బియ్యం ప్రభుత్వం సర ఫరా చేసే ఉచిత బియ్యం ఆనవా ళ్లు 0.01 నుంచి 0.1 శాతం వరకు ఉండడం అత్యంత సహజం అని పేర్కొంది.కానీ కాకినాడ పోర్టు నుం చి విదేశాలకు రేషన్ బియ్యం ఎగు మతి అవుతున్నాయన్న కారణం తో పోర్టు వద్ద చెకోపోస్టులు ఏర్పా టు చేశారని, ఈ చెకోపోస్టుల ద్వా రా కేంద్రం తరపున తాము ఎగుమ తి చేస్తోన్న నూక బియ్యంలో ఫోర్టి ఫైడ్ ఆనవాళ్ల పేరుతో శాంపిళ్లు సేక రించి బియ్యం సీజ్ చేస్తు న్నారని లేఖలో ఎన్ సీఈఎల్ అభ్యంతరం వ్యక్తంచేసింది.సీజ్, శాంపిళ్ల తనిఖీ లతో ఆఫ్రికా దేశాలకు నూకబి య్యం ఎగుమతుల్లో ఇక్కట్లు ఎదు రవుతున్నాయని, తద్వారా జీటూ జీ ఒప్పందాలకు విఘాతం కలుగు తోందని తప్పుబట్టింది.
ఈ నేప థ్యంలో ఆఫ్రికా దేశా లకు కాకినాడ పోర్టు నుంచి వెళ్లే నూక బియ్యం ఎగుమతులకు ఇబ్బందులు తీసు కురాకుండా నౌకల్లో లోడింగు అను మతించాలని కోరింది. మరోపక్క ఈ లేఖతో రాష్ట్రప్రభుత్వం సైతం నూకబియ్యం ఎగుమతి విషయం లో ఆంక్షలు లేకుండా ఆదేశాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలాఉంటే కేంద్ర హోంశాఖతోపాటు సహకార శాఖ పరిధిలో ఎన్సీఈఎల్ పనిచేస్తుంది. గత కొన్నేళ్లుగా నూక బియ్యాన్ని సేకరించి కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఈ సంస్థ ఎగుమతి చేస్తోంది. గతేడాది కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి పలు ఆఫ్రికా దేశాలకు 2.02 లక్షల మెట్రిక్ టన్నుల నూకను ఎగుమతి చేసింది. ఈ ఏడాది ఇప్పటివరకు 2.94 లక్షల మెట్రిక్ టన్నులు ఎగుమతి చేసింది.