Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

10 green medals: పదికి చేరిన పసిడి పతకాలు

--ఆసియా క్రీడల్లో భారత్‌ ఒడిలో మొత్తం 36 పతకాలు

పదికి చేరిన పసిడి పతకాలు

ఆసియా క్రీడల్లో భారత్‌ ఒడిలో మొత్తం 36 పతకాలు

ప్రజా దీవెన /చైనా: ఆసియా క్రీడల్లో భారత్ క్రీడాకారులు పతకాల సాధనలో జోరు పెంచుతున్నారు. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌ అమ్ములపొదిలో మరో బంగారు పతకం చేరింది.

మెన్స్‌ స్క్వాష్‌ టీమ్‌ ఈవెంట్‌లో మహేశ్‌, సౌరవ్‌ గోషల్‌, అభయ్‌సింగ్‌లతో కూడిన భారత జట్టు నసీర్‌ ఇక్బాల్‌, మహ్మద్ ఆసిమ్‌, నూర్‌ జమాన్‌లతో కూడిన పాకిస్థాన్ జట్టుపై విజయం సాధించి బంగారు పతకాన్ని( Winning the gold medal against Pakistan team)  ఒడిసిపట్టింది.

ఈ గోల్డ్‌ మెడల్‌తో కలిసి ఆసియా క్రీడల్లో భారత్‌ గెలిచిన బంగారు పతకాల సంఖ్య 10 కి చేరగా మొత్తం ( The total number of gold medals won by India in the Asian Games has reached 10)  పతకాల సంఖ్య 36కు పెరిగింది. ఈ నెల 24న మొదలైన ఆసియా క్రీడల్లో ఆది నుంచి భారత క్రీడాకారులు గతం కంటే మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు.

షూటింగ్‌, రోయింగ్‌ విభాగాల్లోనే ఎక్కువగా పతకాలు వచ్చాయి. మహిళల క్రికెట్‌లో కూడా భారత్‌కు బంగారు పతకం దక్కింది. ఈక్వెస్ట్రియన్‌లో కూడా దాదాపు 41 ఏళ్ల తర్వాత భారత్‌ బంగారు పతకం (In equestrian too, after almost 41 years, India won a gold medal) నెగ్గి చరిత్ర సృష్టించింది.