Amazing performance in Asian Games: ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శన
-- పదహారు పతకాలతో భారత్ క్రీడాకారుల పరుగులు -- మొత్తంగా 4 స్వర్ణాలు, 5 రజతాలు,7 కాంస్య పతకాలు
ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శన
— పదహారు పతకాలతో భారత్ క్రీడాకారుల పరుగులు
— మొత్తంగా 4 స్వర్ణాలు, 5 రజతాలు,7 కాంస్య పతకాలు
ప్రజా దీవెన/చైనా: ఆసియా క్రీడల్లో భారత్ క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. తాజాగా చైనాలోని హాంగ్జౌలో బుధవారం జరిగిన ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత్ బంగారు పతకం సాధించింది. చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ మొత్తంగా 16 పతకాలు సాధించగా (India won a total of 16 medals in the Asian Games) అందులో నాలుగు స్వర్ణాలు, ఐదు రజతాలు ఏడు కాంస్యాలు లభించాయి.
మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో మనుభాకర్, ఈషా సింగ్ , రిథమ్ సాంగ్వాన్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. క్వాలిఫికేషన్ రౌండ్లో మనుభాకర్ 590 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలవగా ఈషా సింగ్ 586తో ఐదో స్థానంలో నిలిచింది. 1756 స్కోర్‌తో రజత పతకాన్ని కైవసం చేసుకున్న చైనాను తృటిలో వెనక్కి నెట్టి (China, who won the silver medal, was narrowly pushed back) భారత్ మొత్తం స్కోరు 1759 సాధించింది.
రిపబ్లిక్ ఆఫ్ కొరియా 1742 స్కోరుతో కాంస్య పతకాన్ని సాధించింది. క్వాలిఫికేషన్ రౌండ్లో మను అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి అగ్రస్థానంలో నిలవగా ఈషా కూడా అద్భుత ప్రదర్శన కనబరిచి 586 స్కోర్‌తో ఐదవ స్థానంలో నిలిచింది. రిథమ్ తన ఘన స్కోరు 583 ఉన్నప్పటికీ, ఒక దేశానికి ఇద్దరు షూటర్లను మాత్రమే అనుమతించాలనే నిబంధన (The rule is that only two shooters are allowed per country) కారణంగా ఫైనల్స్‌కు దూరమైంది.
మను మొదట అర్హత సాధించగా, ఈషా ఐదో స్థానంలోనూ, రిథమ్ సాంగ్వాన్ ఏడో స్థానంలోనూ అర్హత సాధించారు. అంతకుముందు 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ మహిళల టీమ్ ఈవెంట్లో ఆషి చౌక్సే, మణిని కౌశిక్, సిఫ్ట్ కౌర్ సమ్రా రజత పతకాన్ని సాధించారు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియాడ్‌లో భారత్ జట్లు అద్భుత ప్రదర్శన (Indian teams have performed brilliantly in Asiad) కనబర్చడమే కాకుండా పతకాల సాధనలో కూడా పరుగులు పెడుతున్నారు.