Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో బరోడా సంచలనం.. టీ20 చరిత్ర లోనే అత్యధిక స్కోర్

ప్రజా దీవెన, బరోడా: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లో రోజుకొక రికార్డ్ అభిమానులని కనువిందు చేస్తుంది. గురువారం డిసెంబర్ 5 ఈ టోర్నీలో అతి పెద్ద రికార్డ్ ఒకటి నమోదయింది. బరోడా ధాటికి టీ20 క్రికెట్ లో చాలా రికార్డులు తుడిచిపెట్టుకొని పోయాయి. సిక్కింతో జరిగిన మ్యాచ్ లో బరోడా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 349 పరుగులు చేసింది. దీంతో టీ 20 క్రికెట్‌లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా బరోడా రికార్డు సృష్టించించింది.

అంతకముందు జింబాబ్వే 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 344 నెలకొల్పిన అత్యధిక స్కోర్ ను బరోడా అధిగమించి తొలి స్థానా నికి చేరుకుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బరోడా భాను పానియా 51 బంతుల్లో 134 పరుగులతో విశ్వరూపం చూపించా డు. ఏకంగా 15 సిక్సర్లు బాదాడు. బరోడా ఇన్నింగ్స్‌లో మొత్తం 37 సి క్సర్లు నమోదవ్వడం విశేషం. దీం తో టీ20 క్రికెట్ లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డ్ కూడా బరోడా పైనే ఉంది.ఈ మ్యా చ్ విషయానికి వస్తే సిక్కింపై బరో డా ఏకంగా 263 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మొ దట బ్యాటింగ్ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. 350 పరుగుల లక్ష్య ఛేదనలో 86 పరు గులకే పరిమితమైంది. ఈ మ్యాచ్ లో బరోడా తరపున హార్దిక్ పాండ్య రెస్ట్ తీసుకున్నాడు. కెప్టెన్ కృనాల్ పాండ్య బ్యాటింగ్ కు రాలేదు.