Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Pitch curators: క్రికెట్ మైదాన సిబ్బందికి నజరానా

దేశంలో రెండు నెలల పాటు సాగిన ఐపీఎల్-2024 సీజన్ ఆదివారంతో ముగిసింది. ఆదివారం సాయంత్రం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరి గిన ఫైనల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 8 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున ప్రకటించిన బీసీసీఐ

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశంలో రెండు నెలల పాటు సాగిన ఐపీఎల్-2024 సీజన్ ఆదివారంతో ముగిసింది. ఆదివారం సాయంత్రం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరి గిన ఫైనల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 8 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించిన విషయం తెలిసిందే. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపో యినా ఎక్కడా ఎలాంటి ఆటంకం లేకుండా మ్యాచ్‌లు సజావుగా సాగడంలో మైదానాల సిబ్బంది, పిచ్ క్యూరేటర్లు( pitch curators) కీలక పాత్ర పోషిం చారు. వారి కష్టాన్ని గుర్తించిన బీసీసీఐ వారికి భారీ నజరానా ప్రకటించింది.ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగిన పది రెగ్యులర్ స్టేడియాలకు చెందిన సిబ్బంది, పిచ్ క్యూరేటర్లు ఒక్కొక్కరికీ రూ.25 లక్షల చొప్పున ఇవ్వబోతున్నట్టు బీసీసీఐ కార్యద ర్శి జై షా ట్విటర్(BCCI secretary Jai Shah) ద్వారా ప్రకటించా రు.

క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తీ వ్రంగా శ్రమించి అద్భుతమైన పిచ్‌ లను అందించిన 10 రెగ్యులర్ మైదాన సిబ్బంది, పిచ్ క్యూరేటర్లు ఒక్కొక్కరికీ అభినందనపూర్వకంగా రూ.25 లక్షలు, 3 అదనపు మైదా నాల సిబ్బంది, క్యూరేటర్లు ఒక్కొ క్కరికీ రూ.10 లక్షలు అందించ బోతున్నాం అంటూ జై షా ట్వీట్ చేశారు.ఈ ఐపీఎల్‌లో ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, చండీగఢ్, హైదరాబాద్, బెంగళూరు, లఖ్‌నవూ, అహ్మదాబాద్, జైపూర్ ప్రధాన వేదికలుగా ఉన్నాయి. కాగా, గువాహటి, విశాఖపట్నం, ధర్మశాల స్టేడియాలు అదనపు వేదికలుగా ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ గువాహటిలోనూ, ఢిల్లీ క్యాపిటల్స్ విశాఖపట్నంలోనూ, పంజాబ్ కింగ్స్ ధర్మశాలలోనూ కొన్ని మ్యాచ్‌లు ఆడాయి.

BCCI secretary Jai Shah announced Rs 25 lakh pitch curators