Praja Deveena
Newspaper Banner
Date of Publish : 21 November 2025, 8:29 am Posted by : praja deveena

CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, ఓవరాల్ ఛాంపియన్స్‌ గా తెలంగాణ,230పతకాలు గెలిచి న విద్యార్ధులకు సీఎంరేవంత్ విషెష్ 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: జాతీ య ఏకలవ్య మాడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) స్పోర్ట్స్ మీట్ 2025 లో ఓవరాల్ ఛాంపియన్‌ షి ప్‌ను సాధించిన తెలంగాణ విద్యా ర్థులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందించారు.ఒడిశాలోని రూర్కేలాలో నవంబర్ 11 నుంచి 15 వరకు జరిగిన ఈఎంఆర్ఎస్ స్పోర్ట్స్ మీట్ 2025 లో అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, బా క్సింగ్, జూడో, రెజ్లింగ్, వెయిట్ లి ఫ్టింగ్, టైక్వాండో, యోగా, షూటిం గ్, చెస్‌తో పాటు ఇతర ఈవెంట్లలో అన్ని రాష్ట్రాలకంటే అత్యధికంగా తెలంగాణ విద్యార్థులు రికార్డు స్థా యిలో 230 పతకాలు గెలిచి ఓవ రాల్ ఛాంపియన్స్‌గా నిలిచారు.

ఈ జాతీయ క్రీడల్లో తెలంగాణలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాల యాల సంస్థ (TGEMRS) ఆధ్వ ర్యంలోని 23 పాఠశాలల నుంచి 5 80 విద్యార్థులు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా 22 రాష్ట్రాల నుంచి 49 9 ఈఎంఆర్ఎస్ సంస్థలకు చెందిన 5,500 మంది విద్యార్థులు ఈ క్రీడ ల్లో పాల్గొన్నారు.ఈ క్రీడల్లో నిర్వ హించిన 22 ఈవెం ట్లలో 15 వ్య క్తిగత ఈవెంట్లు, 7 జ ట్టు ఈవెంట్లు ఉన్నాయి.

వాటిల్లో దాదాపు అన్ని విభాగాల్లో తెలంగాణ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ ను కనబరిచారు.ఈ క్రీడల్లో మొత్తంగా 230 పతకాలతో (88 బంగారు, 66 వెండి, 76 కాంస్య పతకాలు), 714 పాయింట్లు సాధిం చి ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కై వ సం చేసుకుని తెలంగాణ కీర్తిని జా తీయ స్థాయిలో చాటారు. వీటిల్లో టీమ్ ఈవెంట్స్‌, వ్యక్తిగత ఈవెంట్ల లోనూ తెలంగాణ విద్యార్థులు స త్తా చాటి అన్ని రాష్ట్రాలకన్నా అగ్ర భాగాన నిలిచారు.

EMRS Sports Meet 2025 లో ఓవరాల్ ఛాంపియన్ షిప్ సాధించి న నేపథ్యంలో విద్యార్థులు ము ఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భం గా ముఖ్యమంత్రి విద్యార్థులను ప్ర శంసిస్తూ, భవిష్యత్తులోనూ ఇదే క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని చెప్పా రు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ఉన్నతా ధికారులు పాల్గొన్నారు.