Pickleball Championship : ప్రజా దీవెన, జమ్మూ సిటీ: ఆల్ ఇం డియా పికిల్‌బాల్ అసోసియేషన్ (AIPA) ఆధ్వర్యంలో జమ్మూ, జ మ్మూ & కాశ్మీర్‌లో సెప్టెంబర్ 26– 28, 2025 తేదీల్లో నిర్వహించిన 9వ జాతీయ పికిల్‌బాల్ ఛాంపి య న్ షిప్ లో తెలంగాణ జట్టు అద్భు త విజయాలను సాధించింది.ఈ జాతీయ పోటీల్లో పాల్గొనడానికి అ మెచ్యూర్ తెలంగాణ పికిల్ బాల్ అసోసియేషన్( ATPA )సెప్టెంబర్ 13–14న రాష్ట్ర స్థాయి ఎంపిక పో టీలు నిర్వహించి, ప్రతిభావంతులై న క్రీడాకారులచే, తెలంగాణ టీము ను ఎంపిక చేసింది.
*తెలంగాణకు బంగారు, కాంస్య పతకాలు*…. ఈ ఛాంపియన్‌షిప్ లో 35+ మిక్స్‌డ్ డబుల్స్ విభాగం లో బంగారు పతకాన్ని ATPA ఉపా ధ్యక్షురాలు సుచరితా ఠాకూర్, జ ట్టు కోచ్ శ్రీ పి. చక్రపాణి గెలుచుకు న్నారు. అదేవిధంగా డా. సోనిబాలా దేవి (VC & MD SATG) 50+ మ హిళల సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో రెండు కాంస్య పతకాలు సాధించారు. ఆమె విజయం అన్ని వయస్సుల ఆటగాళ్లకు ప్రేరణగా నిలిచింది.
*అభినందనలు* జాతీయ స్థా యి లో తెలంగాణ గర్వకారణమైన ఈ విజయాన్ని సాధించినందుకు తె లంగాణ క్రీడలు, యువజన సర్వీ సుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, తె లంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శి వసేనారెడ్డిలు పతకాలు సాధించిన క్రీడాకారులకు అభినందనలు తెలి యజేశారు.జాతీయ స్థాయిలో తె లంగాణ క్రీడాకారులు పతకాలు గె లవడం రాష్ట్రానికి గర్వకారణం. ఈ విజయాలు పికిల్‌బాల్ క్రీడ ప్రాచు ర్యాన్ని మాత్రమే కాకుండా, మన రాష్ట్రంలోని ప్రతిభా స్థాయిని కూడా చాటుతున్నాయని క్రీడా శాఖ మం త్రి వాకిటి శ్రీహరి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డిలు అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఎండి డాక్టర్ సోనీ బాలాదేవి, ఉద్యోగరీత్యా క్రీడాభివృ ద్ధికి కృషి చేయడమే కాకుండా స్వ యంగా క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించడం గొప్ప విషయమని వారన్నారు
*తెలంగాణలో పికిల్ బాల్ ను ప్రోత్సహిస్తాం* …రాష్ట్రవ్యాప్తంగా పికిల్‌బాల్ క్రీడను ప్రోత్సహించి, భ విష్యత్ చాంపియన్లను తీర్చిదిద్ద డంలో, తెలంగాణకు జాతీయ క్రీడా పటంలో మరింత ప్రాధాన్యం కల్పిం చడంలో ATPA కట్టుబడి ఉందని అధ్యక్ష కార్యదర్శులు రమేష్ జగ న్మోహన్ లు ప్రకటించారు. హైదరా బాద్ నగరం మే కాదు తెలంగాణ లో క్రమక్రమంగా విస్తరిస్తున్న పికిల్ బాల్ క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ ము వివిధ క్రీడా సంస్థలు సహకరిం చాలని వారు కోరారు.