Praja Deveena
Newspaper Banner
Date of Publish : 05 March 2026, 9:07 am Posted by : praja deveena

Team India Fans : బిగ్ బ్రేకింగ్, టీమిండియా అభిమా నుల గుండెల్లో గుబులు, ఉత్కంఠ రేపుతోన్న రోజు రానేవచ్చిoది

Team India Fans : ప్రజా దీవెన, హైదరాబాద్: టీ20వర ల్డ్ కప్ 2026 ఫైనల్‌కు కేవలం రెండు అడుగుల దూరంలో నిలిచిన భారత్ మార్చి5 గురువారం సెమీఫైనల్‌లో ఇంగ్లాం డ్‌ను ఎదుర్కొనబోతోంది. సూపర్-8లో భీకరమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన వెస్టిం డీస్‌ను చిత్తు చేసిన సూర్యసేన ఇప్పు డు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో సెమీస్ రంగంలోకి దిగుతోం ది.ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటె ఈ టోర్నీలో భారత్ మొదటిసారి ఇంగ్లాండ్‌తో తలపడుతోంది. కానీ అభిమాను ల మనసులో ఒక ప్రశ్న మాత్రం తిరుగుతోంది.

  ఆ సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అవుతుందా

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ పో రు వరుస గా మూడోసారి జరుగుతుండడం గమనార్హం. 20 22లో తొలిసారి ఈ రెండు జట్లు సెమీస్‌లో ఎదురెదుర య్యాయి. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలిచి ఫైనల్‌కు వెళ్లింది. అక్కడ పాకిస్థాన్‌ను ఓడించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. 2024లో మళ్లీ సెమీ ఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్ తలప డ్డా యి. ఈసారి భారత్ గెలిచి ప్రతీ కారం తీర్చుకుంది. తర్వాత ఫైనల్‌ లో సౌతాఫ్రికాపై ఉత్కంఠభరిత పోరులో విజయం సాధించి కప్‌ను సొంతంచేసుకుంది.

    ఇక్కడే ఆసక్తికరమైన సెంటి మెంట్…

గత రెండు సార్లు సెమీ ఫైనల్‌లో గెలిచిన జట్టే చివరికి ఛాం పియన్ అయ్యింది. అయితే ఈసారి కూడా అదే సెంటి మెం ట్ కొనసాగుతుందా, భారత్ ఇంగ్లాండ్‌ను మరోసారి ఓడిం చి టైటిల్ దిశగా అడుగులు వేస్తుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. కోట్లాది అభిమానులు ఊపిరి బిగపట్టి ఎ దురు చూస్తున్న ఈ మ్యాచ్ క్రికెట్ ప్రపంచానికి మరో థ్రిల్లింగ్ కథ ఇ వ్వబోతోందని పరిశీలకులు భావిస్తున్నారు.