Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Carafe government schools for genuine education with sports క్రీడలతో కూడిన అసలైన విద్యకు కేరాఫ్ ప్రభుత్వ పాఠశాలలు

-- జీవితాన్ని చదవడంలో క్రీడలదే ప్రముఖ పాత్ర -- క్రీడా స్ఫూర్తి కొరవడటమే పిల్లల అఘాయిత్యాలకు కారణం -- ఒత్తిడికి గురవుతున్న పిల్లలకు క్రీడలదే ఉపశమన పాత్ర -- సూర్యాపేటలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో క్రీడావస్తుల పంపిణీ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్ రెడ్డి

క్రీడలతో కూడిన అసలైన విద్యకు కేరాఫ్ ప్రభుత్వ పాఠశాలలు

— జీవితాన్ని చదవడంలో క్రీడలదే ప్రముఖ పాత్ర

— క్రీడా స్ఫూర్తి కొరవడటమే పిల్లల అఘాయిత్యాలకు కారణం

— ఒత్తిడికి గురవుతున్న పిల్లలకు క్రీడలదే ఉపశమన పాత్ర

సూర్యాపేటలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో క్రీడావస్తుల పంపిణీ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్ రెడ్డి

ప్రజా దీవెన /సూర్యాపేట: ప్రస్తుత సమాజం లో చిన్నారులకు కావాల్సిన అసలైన విద్య క్రీడలతోనే లభిస్తుందని సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. చిన్నారులలో క్రీడా స్ఫూర్తిని పెంచడమే లక్ష్యంగా సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా సామాగ్రి పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి జిల్లాలో ఉన్న 155 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు , గురుకులాలు, మోడల్ స్కూల్స్ లకు క్రీడ సామాగ్రితో కూడిన కిట్ల ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,జీవితాన్ని చదవడంలో క్రీడలదే ప్రముఖ పాత్ర అన్నారు.

చిన్న చిన్న కారణాలకు పిల్లలు ఇటీవల కాలం లో అఘాయిత్యాలకు పాల్పడటానికి కారణం తరగతి గది, హాస్టల్ గదికి పరిమవుతూ క్రీడలకు దూరంగా ఉండటం ,క్రీడా స్ఫూర్తి కొరవడటమే పిల్లల అఘాయిత్యాలకు కారణం అన్నారు. ప్రస్తుత ఆధునిక యుగం లో సెల్ ,టీ.వి లకే పరిమితమవుతుండటం తో చిన్న చిన్న కారణాలకు ఒత్తిడికి గురవుతున్న పిల్లలను బయట పడేయటం లో క్రీడలదే ప్రధాన పాత్ర అన్నారు.

క్రీడలలో గెలుపు, ఓటముల ద్వారా వచ్చే అనుభవాలు జీవితంలో వచ్చే ఆటు, పోటులను తట్టుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఇటీవల తాను సూర్యాపేట నియోజక వర్గం లో నిర్వహించిన క్రీడల లో సైతం వేలాది గా ప్రజలు పాల్గొనడం, అందునా, మహిళలు 27 వేల మంది పాల్గొనడం నాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు.

50 ఏళ్ళ వయసు లో సైతం మహిళలు కబడ్డీ ఆడటం, ఆటలు నిర్వహించినందుకు తనకు ధన్యవాదాలు చెప్పడం తనకు సంతృప్పి ఇచ్చిందన్నారు.పిల్లలకు ఉపయోగపడే ఏ కార్యక్రమంలో అయినా నా భాగస్వామ్యం ఉంటుందన్న మంత్రి, క్రీడలతో కూడిన పరిపూర్ణ విద్య కు కేరాఫ్ గా ను ప్రభుత్వ పాఠశాలల ను తీర్చిద్ధిద్ది సూర్యాపేట జిల్లా ను క్రీడా హబ్ గా తీర్చి దిద్దాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ వెంకట్రావ్, డీఈవో తదితరులు పాల్గొన్నారు.