*దేశ చరిత్రలోనే కోదాడలో మొట్టమొదటిసారిగా విశ్రాంత ఉద్యోగుల క్రీడా పోటీలు. దామోదర్ రెడ్డి, సీతారామయ్య
Competitions : ప్రజా దీవేన,కోదాడ: కోదాడలో జరుగుతున్న రాష్ట్రస్థాయి విశ్రాంత ఉద్యోగుల క్రీడా సాహిత్య సంస్కృతిక పోటీలు ఆత్మీయతకు ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య అన్నారు. సోమవారం కోదాడ పబ్లిక్ క్లబ్ ఆడిటోరియం మైదానంలో రసవత్వంగా నడుస్తున్న క్రీడా సాంస్కృతిక పోటీలను వారు పర్యవేక్షించి మాట్లాడారు భారతదేశ చరిత్రలోనే కోదాడ లో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రీడా సాంస్కృతిక సాహిత్య పోటీలు నిర్వహించడం చరిత్రలో మైలురాయిగా నిలుస్తుంది అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి ఆరుపదుల వయసు దాటిన యువకుల మాదిరిగా క్రీడల్లో పాల్గొనేందుకు భారీగా క్రీడాకారులు తరలివచ్చారన్నారు.
క్రీడలు శారీరక వ్యాయామం మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. కాగా మంగళవారం క్యారమ్స్ చెస్ టెన్నికాయిట్ షటిల్ నడక పోటీలు సెమీఫైనల్ దశకు చేరుకున్నాయి రేపు మధ్యాహ్నం వరకు ఫైనల్స్ ముగించుకొని బహుమతి ప్రధానోత్స కార్యక్రమం నిర్వహిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రతిభకు వయసు అడ్డం రాదని క్రీడల్లో విశ్రాంత ఉద్యోగులు ప్రతిభను కనిపరిస్తూ చూపరు లను ఆకట్టుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుదర్శన్ రెడ్డి బొల్లు రాంబాబు, యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, అక్కిరాజు వెంకట్రావు, విద్యాసాగర్ రావు, భ్రమరాంబ, రఘు, ఓరుగంటి రవి తదితరులున్నారు……