–సండేస్ అండ్ సైక్లింగ్ విస్తృతం చే యాలి
–తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
Governor Jishnu Dev Varma : ప్రజా దీవెన, హైదరాబాద్: జాతీయ క్రీడ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం గచ్చిబౌలి స్టేడియం వద్ద జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమానికి రాష్ట్ర గవర్న ర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హా జరై జెండా ఊపి సైక్లింగ్ ర్యాలీని ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ పర్యావరణ హితానికి, పచ్చని జీవనశైలికి సై క్లింగ్ ఎంతో దోహదం చేస్తుందని, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకర మైన సైక్లింగ్ ను తెలంగాణలో వి స్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన అన్నారు.
భారత ప్రభుత్వం విస్తృతంగా చేప ట్టిన సండేస్ ఆన్ సైక్లింగ్ అనే కార్య క్రమాన్ని జాతీయ ఫిట్నెస్ ఉద్య మంలా తెలంగాణలో నిర్వహించా లని ఫిట్నెస్ కి డోస్ -అరగంట రోజ్ అన్న నినాదాన్ని విద్యార్థుల్లో యు వకుల్లో ఉద్యోగులు స్వచ్ఛంద సం స్థలు వివిధ వర్గాల ప్రజల్లో అవగా హన కలిగించే కార్యక్రమాలు నిర్వ హించాలని ఆయన సూచించారు.
క్రీడా కార్యక్రమాల్లో అందరూ పాల్గొ నడం వల్ల సామాజిక బంధాలను బలపరుస్తాయని ఆయన అన్నా రు.
క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మా ట్లాడుతూ తెలంగాణ క్రీడా శాఖ ఆ ధ్వర్యంలో తెలంగాణ స్పోర్ట్స్ అథా రిటీ జాతీయ క్రీడా దినోత్సవం తొ మ్మిది రోజులపాటు ఘనంగా నిర్వ హించి దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడిందని అన్నారు.
పసి వయసు పిల్లలనుండి పండు ముసలి వరకు తెలంగాణ క్రీడా శా ఖ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భా గస్వామ్యం కావడం హర్షనీయమ న్నారు.
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ సీఎం రే వంత్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహంతో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వ హించే కార్యక్రమాలకు దేశవ్యాప్తం గా ప్రశంసలు అందుతున్నాయని, సైక్లింగ్ క్రీడను మరింతగా ప్రోత్స హించే కార్యక్రమాలు విస్తృత స్థా యిలో చేపడతామన్నారు.
*స్పోర్ట్స్ పల్స్ ప్రారంభం* తెలం గాణ క్రీడాకారులు సాధించిన విజ యాలను, స్పోర్ట్స్ అథారిటీ కార్య క్రమాలను సంక్షిప్తంగా సమాజానికి తెలియజేసి భావి క్రీడాకారులకు స్ఫూర్తి కలిగించే విధంగా రూపొం దించిన నెలవారి సంచిక స్పోర్ట్స్ పల్స్ (క్రీడా నాడి)బులెటిన్ గవ ర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ ఆవిష్కరిం చారు.
*అనూహ్యస్పందన* …ఫిట్ ఇం డియా సండేస్ ఆన్ సైక్లింగ్ లో భా గంగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ జెండా ఊపి ప్రారంభించిన సైకిల్ ర్యాలీ గచ్చి బౌలి స్టేడియం మెయిన్ గేటు నుం డి ప్రారంభమై త్రిబుల్ ఐటీ జంక్షన్, గచ్చిబౌలి ఫ్లైఓవర్ పిస్తా హౌస్ ఐక్య షోరూం ఇనోరబిట్ నుండి కేబుల్ బ్రిడ్జి నుండి మాదాపూర్ వైపు అటు నుంచి భారతీయ విద్యా భవన్ టీ హబ్ డల్లాస్ సెంటర్ రోడ్డు నుండి బయో డైవర్సిటీ రోడ్డు మీదుగా గచ్చిబౌలి స్టేడియానికి చేరుకుంది.
ఇందులో పాల్గొన్న దాదాపు 1,000 మంది సైక్లిస్టులకు తెలంగాణ స్పో ర్ట్స్ అథారిటీ తరఫున సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి సైకిలిస్టుల నుండి మంచి స్పందన లభించింది. సీని యర్ సిటిజన్స్ తో పాటు విద్యార్థు లు యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్య క్రమంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ డా క్టర్. సోనీ బాలాదేవి, తెలంగాణ ఒ లంపిక్ అసోసియేషన్ కార్యదర్శి మల్లారెడ్డి ఐజీ (క్రీడలు ) రమేష్ డిసిపి వినీత్ గచ్చిబౌలి స్టేడియం అడ్మినిస్ట్రేటర్ కన్నం మ ధు వివిధ క్రీడా సంఘాల ప్రతిని ధు లు సైక్లిస్ట్ సంఘాల ప్రతినిధులు స్పోర్ట్స్ అ థారిటీ అధికారులు పాల్గొన్నారు.