ఫుట్ బాల్ టైటిల్ గెలిచిన ఇండియా
ప్రజా దీవెన/కువైట్: SAAF ఛాంపియన్‌షిప్ ఫుట్‌బాల్ ఫైనల్‌లో భారత్ అదరగొట్టింది. కువైట్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి ఇరు జట్ల స్కోర్లు 1-1 టై కాగా పెనాల్టీ షూటౌట్‌లో 5-4 తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో 9 వసారి SAAF ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను భారత్ సొంతం చేసుకుంది. దీంతో సునీల్ ఛేత్రీ కెప్టెన్సీలోని భారత్ జట్టుకు ఫ్యాన్స్ అభినందనలు తెలుపుతున్నారు.