Gautam Gambhir -BCCI: టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ (Gautam Gambhir ) గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన గురించి తెలియని క్రికెట్ అభిమానులు ఎవరు ఉండరు. ఇక తాజాగా భారత జట్టు ప్రధాన కోచ్ గా గౌతమ్ గంభీర్ (Gautam Gambhir )ఎంపిక అవడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తుంది. తొలి దశగా తాజాగా బీసీసీఐ (bcci) క్రికెట్ అడ్వర్టైజరీ కమిటీ నిర్వహించిన ఇంటర్వ్యూకు గౌతమ్ గంభీర్ హాజరవ్వడంతో పాటు డిమాండ్లు వాళ్లని కోరడం జరిగినట్లు సమాచారం. ఇందులో మొదటి డిమాండ్ ఏమిటంటే.. మూడు జట్ల ఎంపిక.. ఒక్క మాటలో చెప్పాలంటే.. వైట్ బాల్ (white ball), రెడ్ బాల్ (red ball) క్రికెట్ కోసం ప్రత్యేక టీమ్స్ ను ఎంచుకోవడానికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని కోరారు.
ఇక ముఖ్యంగా గౌతమ్ (Gautam Gambhir ) ఇక్కడ మూడు జట్లను డిమాండ్ చేయడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే.. ఎందులోనైనా బలమైన జట్టును ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం. అంటే టెస్ట్ క్రికెట్లో (test cricket) ఆడగల సత్తా ఉన్న ప్లేయర్స్ మాత్రమే ఆ మోడల్ కు ఎంపిక చేసుకోవడానికి అవకాశం అన్నట్లు. ఇక ఈ డిమాండ్ తో పాటు నిర్ణిత ఓవర్ మ్యాచుల కొరకు ప్రత్యేక జట్లను ఏర్పాటు చేయాలని గౌతమ్ గంభీర్ అడిగినట్లు తెలుస్తుంది. అలాగే పొట్టి ఫార్మాట్ లో బ్యాట్ ఆటగాళ్లకు మాత్రం గుర్తింపు లభిస్తుంది. ఇక ఇలా గౌతమ్ గంభీర్ ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసి అందరికి అవకాశం వచ్చే విధంగా జట్టును మూడు రకాలుగా చాలా స్ట్రాంగ్ టీమ్ గా (team) మార్చాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.
ఇక మరోవైపు సీనియర్ ఆటగాళ్ల విషయానికి వస్తే.. గౌతమ్ గంభీర్ ((Gautam Gambhir )) డిమాండ్ (demand) దృశ్య టి20 జట్టు (t20 team) నుంచి సీనియర్ ప్లేయర్స్ ను దాదాపు తప్పించడం ఖాయమని తెలుస్తుంది. ఎందుకంటే 2026 లో టీ20 కప్ కొరకు గౌతమ్ గంభీర్ కొత్త జట్టును ఏర్పాటు చేసే ప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ టీంలోకి చేర్చుకోవడానికి గౌతమ్ గంభీర్ దాదాపు కొత్త యువ భారత్ ఆటగాళ్ల కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఇక మరోవైపు టీమ్ ఇండియా హెడ్ కోచ్ పదవి కోసం తొలి రెండు రౌండ్లు పూర్తి అయినట్లు అలాగే బీసీసీఐ కూడా అడిగిన డిమాండ్లకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇంటర్వ్యూకు సంబంధించిన రెండవ రౌండ్ ఇంటర్వ్యూ బుధవారం నాడు జరగబోతుంది. ఆ తర్వాత క్రికెట్ అడ్వైజర్ కమిటీ గౌతమ్ గంభీర్ ను ప్రధాన కోచ్ పదవికి ఎంపిక చేయాలని బీసీసీఐ (bcci) ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అనంతరం బిసిసిఐ గౌతమ్ గంభీర్ ను టీమిండియా ప్రధాన కోచ్ గా అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు.