Iran Israel war gulfair space : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: గల్ఫ్ గగన తలo ఒక్కసారిగా మూగబోయింది. పశ్చి మా సియాలో పెరిగిన ఉద్రి క్తతల ప్రభావం నేపధ్యంలో మొత్తం 10 దేశాలు తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయ డంతో అంతర్జాతీయ విమాన రాకపోకలు కుదేలయ్యాయి. ఇరాన్, ఇరాక్, బె హ్రైన్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైట్ దేశాల్లో విమాన సర్వీసులు పూ ర్తిగా నిలిచిపోయాయి.అదే సమ యంలో ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, యునైటెడ్ అర బ్ ఎమిరేట్స్ దేశాల్లో పలు విమానాలు రద్దుకావడం గమనా ర్హం.
భారత్ ప్రయాణికులకు భారీ దెబ్బ
గల్ఫ్ మార్గం మీదుగా ప్రయాణించే భారతీయులకు ఇది అ తిపెద్ద షాక్‌గా మారింది. సాధారణంగా అమెరికా, యూరప్ కు వెళ్లే విమానాలు గల్ఫ్ గగనతలం గుండా ప్రయాణిస్తా యి. కానీ ఇప్పుడు ఆ మార్గా లు మూసుకుపోవడంతో ప్ర త్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిం ది. కాగా ఇప్పు డు విమానాలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తు ర్కమెనిస్తాన్, ఖజకిస్తాన్, ఉక్రెయిన్ దేశాల మీదుగా మళ్లిం పులు చేస్తున్నారు.
ఈ మార్గాలు ఎక్కువ దూరం కావ డంతో ప్రయాణ సమ యం గంటల కొద్దీ పెరుగుతోంది. ఇంధనవ్యయం అధికమవ డంతో విమానయాన సంస్థలపై అదనపు భారం పడు తోం ది.ప్రత్యామ్నాయ మార్గాల కారణంగా టికెట్ ధరలు భారీగా పెరి గాయి. తక్షణ బుకింగ్స్‌పై సాధారణ ధరల కంటే 30 శా తం నుంచి 6 0 శాతం వరకు అధికంగా వసూలు చేస్తున్న ట్లు ట్రావెల్ వర్గాలు చెబుతున్నాయి.
విద్యార్థులు, అత్యవసరంగా విదేశాలకు వెళ్లాల్సినవారు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇ దిలా ఉండగా ప్ర స్తుతం అంతర్జాతీయ విమానయాన సంస్థలు భద్రతాపరిస్థి తులను సమీక్షిస్తున్నాయి. పరిస్థితులు మెరుగుపడితేనే గగ నతలం తిరిగి తెరుచుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు ప్ర యాణికులు ఆలస్యాలు, అధిక ఖర్చులను భరించాల్సిం దే.గల్ఫ్ ఆకాశం ఎప్పుడు మళ్లీ తెరు చుకుంటుందో అన్న ఆ తృతలో ప్రపంచ ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో అపూర్వ పరిస్థితు లు….
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న సందర్భంలో రా జీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (shamshabad airport) లో అపూర్వ పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఏర్పడిన యుద్ధ వాతావరణం ప్ర భావం తో విదేశాలకు వెళ్లాల్సిన అ నేక అంతర్జాతీయ విమానాలు ఒ క్కసారిగా రద్దు కావడం ఆందోళన కు గురు చేస్తోంది.
దోహా, అబుదాబి, జెడ్డా, సౌదీ అరేబియా, కువైట్, దుబాయ్, మస్క ట్, మదీనా వంటి కీలక గమ్యస్థా నాలకు వెళ్లాల్సిన సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ప్ర యాణికు లు విమానాశ్రయానికి చేరుకున్నాకే రద్దు సమాచారం అం దుకోవడంతో గందరగోళం నెలకొంది. టికెట్లు బుక్ చేసుకు న్న వంద లాది మంది ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళి కలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మొత్తం మీద శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరా ల్సిన సుమారు 22 విమానాలు రద్దవ గా, విదేశాల నుంచి రావాల్సిన మ రో 22 విమానాలు కూడా నిలిచి పోయాయి. పశ్చిమాసియాలో భ ద్రతా పరిస్థితులు స్పష్టంగా మారే వర కు ఈ నిర్ణయం కొనసాగవచ్చని తెలుస్తోంది.ప్రముఖ విమా నయాన సంస్థలు అయిన ఎయిర్ ఇండియా (Air India), ఇండిగో (IndiGo), ఎమిరేట్స్ ( Emirate s), ఖతార్ ఎయి ర్వేస్ (Qatar Air ways) తమ సర్వీసులను జాగ్రత్త చర్య ల్లో భాగంగా రద్దు చేసినట్లు సమాచారం.
అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు నేరుగా సాధారణ ప్రజ ల ప్రయాణాలపై ఎలా ప్రభావం చూపుతాయో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. పరిస్థితులు సాధారణ స్థితికి చే రుకునే వరకు ప్రయాణికులు తమ విమానాల వివరాలను ముందుగానే చెక్ చేసుకోవాలని విమానాశ్రయ అధికారులు సూచిస్తున్నారు.
