Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్య, జైలు నిర్బంధస్థలం కాద ని చెదిరిన జీవితాల పునర్నిర్మాణ ప్రదేశo 

Minister Bandi Sanjay : ప్రజాదీవెన,హైదరాబాద్: జైలు అంటే కేవలం నిర్బంధ స్థలం కాద ని, చెదిరిన జీవితాలను పున ర్ని ర్మించడానికి అవకాశం ఇచ్చే ప్రదే శ మని కేంద్ర హోంశాఖ సహాయ మం త్రి బండిసంజయ్ వ్యాఖ్యానించా రు. ఖైదీల్లో సత్ప్రవర్తన తెచ్చి వారి ని మళ్లీ సమాజంలోకి పంపడమే జై ళ్ల శాఖ అసలు విజయమని ఆయ న అభిప్రాయపడ్డారు.7వ ఆల్ ఇం డియా ప్రిజన్ డ్యూ టీ మీట్ 202 5ముగింపు వేడుకల్లో బండి సంజ య్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీ ట్లో అత్యధిక ట్రోఫీలతో తెలంగాణ జైళ్లశాఖ జాతీయ స్థాయిలో కీర్తి చా టిందన్నారు.జాతీయ స్థాయి పోటీ లను ఎంతో ఘనంగా నిర్వహించా రని సౌమ్య మిశ్రాను కేంద్రమంత్రి ప్ర త్యేకంగా అభినందించారు. ‘జైలు వ్యవస్థ కేవలం భద్రతకే పరిమితం కాకుండా సంస్కరణలు, పునరావా సానికి వేదికగా మారుతోందని అ న్నారు. మహాత్మా గాంధీ కొన్ని సం దర్భాల నుంచి ప్రేరణ పొంది “నేర స్తుడిని కాదు, నేరాన్ని ద్వేషించండి’ అని అన్నారని ఆయన గుర్తుచేశా రు.

మరో అతిథిగా రాష్ట్ర మంత్రి పొం గులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మా ట్లాడుతూ ఎన్నో అంశాల్లో సం స్క రణలతో ముందుకు వెళుతున్న తె లంగాణ జైళ్ల శాఖను దేశ వ్యాప్తం గా రోల్ మోడల్ గా తీసుకోవాలని అన్నారు. జాతీయ స్థాయిలో డ్యూ టీ మీట్ ను విజయవంతంగా నిర్వ హించినందుకు తెలంగాణ జైళ్ల శా ఖను రాష్ట్ర ప్రభుత్వం తరుపున అ భినందిస్తున్నట్టు తెలిపారు.

తెలంగాణ జైలు, శిక్షణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా మా ట్లాడుతూ ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు 28 పతకాలు (21 స్వర్ణం) సాధించి స మగ్ర విజేతగా నిలవడం గర్వకార ణమన్నారు. తమిళ నాడు 17 పత కాలు, మహారాష్ట్ర 16 పతకాలు సాధించాయని, మొత్తం 133 పత కాలను వివిధ విభాగాల్లో ప్రదానం చేసారు. హైదరాబాద్ లో నేషనల్ ప్రిజన్ అకాడమీ ఏర్పాటు, ఆధారి త ఆధునిక పర్యవేక్షణ, కొత్త డీ-అ డిక్షన్ సెంటర్లు, వరంగల్ లో హై- సెక్యూరిటీ జైలు నిర్మాణం వంటి సంస్కరణలను త్వరలో అమలు చే యబోతున్నామని తెలిపారు.

ఇదిలా ఉండగా హైదరాబాద్ లోని ఆర్బీ వీఆర్ఆర్ తెలంగా ణ పోలీస్ అకాడమీ ప్రాంగ ణంలో “7వ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్ – 20 25” ముగింపు వేడుకలు గురువా రం రాత్రి ఘనంగా జరిగాయి. తెలం గాణ జైళ్ళు మరియు శిక్షణా సేవల విభాగం, కేంద్ర హోంశాఖ కు చెందిన బ్యూరో ఆఫ్ పోలీస్ రీసె ర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించింది. ఈ పో టీలలో 21 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలి త ప్రాంతాల నుండి 1222 మందికి పైగా అ ధికారులు, సిబ్బంది పాల్గొ ని క్రీడలు, సాంస్కృతిక, ప్రొఫెషన ల్ మరియు ఫైన్ ఆర్ట్స్ విభాగాల్లో పాల్గొని అద్భుత మైన తమ ప్రతిభ కనబరిచారు. తొలిసారిగా ఏర్పాటు చేసిన టెక్నాలజీ ఎక్స్ పో ప్రిజన్ ప్రొడక్ట్స్ ప్రదర్శన అందరిని ఆకట్టు కుంది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్ట ర్ జితేందర్ ఐపీఎస్, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అదనపు డీజీపీ రవి జోసెఫ్ ఐపీ ఎస్, ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ

పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్ట్ ఐపీఎస్, తదితర అధికారులు పాల్గొన్నారు.