Kohli and Anushka: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli), ఆయన సతీమణి బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ (Anushka Sharma) ఎంతో ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులు అన్న సంగతి తెలిసిందే. వారు రోజూ వ్యాయామం చేయడం, సకాలంలో నిద్రపోవడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తారు. అంతేకాదు త్వరగానే డిన్నర్ చేస్తారు. ఇప్పుడు ఆశ్చర్యంగా ఉన్న విషయం ఏంటంటే, వీళ్ళు తాగే నీరు కూడా చాలా ప్రత్యేకమైనదట! అవును, నీళ్ళు అన్ని ఒకేలా ఉండవు అన్నట్లుగా, వీళ్ళు తాగే నీరు మనం సాధారణంగా తాగే నీటి కంటే చాలా భిన్నంగా ఉంటుంది.
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇద్దరూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ వాటర్ (Special brand water) తాగుతుంటారు. ఆ నీటిని వేరే దేశం నుంచి దిగుమతి చేసుకుంటారట. అంటే, మన దేశంలో దొరకని నీరు అది. అంతేకాదు, ఆ నీటి ధర కూడా చాలా ఎక్కువ. కొంతమందికి అది కొంచెం షాకింగ్‌గా ఉండొచ్చు. ఆ నీటి పేరు ఎవియాన్ నేచురల్ స్ప్రింగ్ వాటర్ (Evian Natural Spring Water). ఈ వాటర్ ఫ్రాన్స్ దేశంలోని వియాన్-లెస్-బెయిన్స్ (vian-Les-Bains) అనే చిన్న పట్టణం నుంచి వస్తుంది. ఈ పట్టణం జెనీవా సరస్సు ఒడ్డున ఉంది. జెనీవా సరస్సు పశ్చిమ యూరప్ లో అతిపెద్ద సరస్సులలో ఒకటి. ఈ సరస్సు స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఉంది.
ఈ నీరు చాలా శుభ్రంగా ఉంటుంది. దీనిలో ఎలాంటి రసాయనాలు ఉండవు. ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన నీరు. ఎలాంటి కాలుష్యం (No pollution) లేని ప్రాంతం నుంచి వస్తుంది. ఈ నీటిని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రముఖులు తాగుతారు. విరాట్ కోహ్లీ తన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అందుకే ఆయన శుభ్రమైన, ఆరోగ్యకరమైన నీటిని ఎంచుకున్నారు. ఈ నీరు ఆయన శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుందని నమ్ముతారు.
సాధారణంగా ఒక లీటర్ ఎవియాన్ నీటి బాటిల్ ధర (Water bottle cost) సుమారు 600 రూపాయలు ఉంటుంది. ఒకవేళ మనం రోజుకు రెండు లీటర్ల ఎవియాన్ నీరు తాగితే, రోజుకు 1200 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే, ఒక నెలకు దాదాపు 36,000 రూపాయలు! విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇద్దరూ కలిసి రోజూ దాదాపు నాలుగు లీటర్లు ఈ వాటర్ తాగుతారు. అంటే నెలకి కేవలం వాటర్ కోసం 72,000 ఖర్చు చేస్తారు. ఆన్‌లైన్‌లో ఎవియాన్ నీటి బాటిళ్ల ప్యాక్‌లు కొంచెం తక్కువ ధరకు లభిస్తాయి. ఉదాహరణకు, అమెజాన్ ఇండియాలో 12 బాటిళ్ల ఎవియాన్ నీటి ప్యాక్ ధర సుమారు 4200 రూపాయలు ఉంటుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న చాలా మంది ఇండియా నీళ్లు పనికిరావా అంటూ విమర్శలు చేస్తున్నారు.