Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Liverpool Fans: దూసుకెళ్లిన కారు, గాయపడ్డ ఫుట్‌బాల్ అభిమానులు..

ప్రజా దీవెన, ఇంగ్లాండ్‌: అభిమానుల ఆనందోత్సాహాలు అంతలోనే ఆవిరయ్యాయి. అభిమానుల కేరింతలతో అలరారుతున్న ఆ ప్రాంతం ఉన్నపళంగా ఆర్తనాదాలతో మారుమోగింది. ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్‌ (Liverpool)లో ఫుట్‌బాల్‌ (Football) అభిమానులపై కారు దూసుకెళ్లిన ఘటనలో 47 మందికిపైగా గాయపడ్డారు.

ప్రీమియర్‌ లీగ్‌లో 20వ టైటిల్‌ను లివర్‌పూల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో లివర్‌పూల్‌లో ఆ జట్టు భారీ ఎత్తున సంబరాలు చేపట్టింది. అభిమానులకు అభివాదం చేస్తూ లివర్‌పూల్ టీమ్ పరేడ్ నిర్వహించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు అభిమాన జట్టు సంబరాల్లో పాల్గొన్నారు.

అందరూ ఆనందంలో మునిగి ఉన్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. సిటీ సెంటర్‌లోకి మినీవ్యాన్‌తో వేగంగా దూసుకొచ్చిన దుండగుడు అనేకమందిని ఢీకొట్టాడు. దీంతో పలువురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 27 మందిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు చెప్పారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో నలుగురు చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి 53 ఏళ్ల వయనున్న డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు.