SportsIndiaOpinionWorldజాతీయంతెలంగాణహైదరాబాద్

Praggnanandhaa Creates History: ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు ఎందులో తెలుసా ?

Praggnanandhaa Creates History: భారత యువ చెస్ సంచలనం ఆర్ ప్రజ్ఞానంద మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓస్లోలో జరిగిన ప్రతిష్ఠాత్మక నార్వే చెస్ (Norway Chess)2026 టోర్నీలో విజేతగా నిలిచి, ఈ టైటిల్‌ను అందుకున్న తొలి భారతీయ ఆటగాడి గా చరిత్ర సృష్టించాడు. చివరి రౌండ్‌లో జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమర్‌పై క్లాసికల్ గేమ్‌లో విజయం సాధించి ట్రోఫీ ని సొంతం చేసుకున్నాడు.

టోర్నీ ప్రారంభంలోనే ప్రజ్ఞానందకు పరిస్థితులు అనుకూలం గా లేకపోయాయి. ఆరో రౌండ్ ముగిసే సమయానికి వరుస పరాజయాల కారణంగా పాయింట్ల పట్టికలో చివరి స్థానా ని కి చేరుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ డి గుకేశ్ (D Guke sh)చేతిలోనూ ఓటమి ఎదురైంది. అయితే అక్కడి నుంచి అతడు చూపించిన పునరాగమనం చెస్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

మలిదశలో వరుసగా నాలుగు క్లాసికల్ గేమ్‌ల్లో విజయం సాధించిన ప్రజ్ఞానంద టైటిల్ పోరులోకి దూసుకొచ్చాడు. అ లీరెజా ఫిరౌజ్జా, మాగ్నస్ కార్ల్‌సన్, డి గుకేశ్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లను వరుసగా ఓడించి తన సత్తా చాటాడు. ము ఖ్యంగా ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌పై తెలుపు, న లుపు పావులతో ఒకే టోర్నీలో రెండు క్లాసికల్ విజయాలు నమోదు చేయడం విశేషంగా నిలిచింది.

ఇప్పటివరకు భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ (Vishwanadh Ananad) మాత్రమే కార్ల్‌సన్‌పై ఒకే టోర్నీ లో రెండు క్లాసికల్ విజయాలు సాధించాడు. ఇప్పుడు ప్రజ్ఞా నంద కూడా అదే ఘనతను అందుకుని భారత చెస్ చరిత్ర లో ప్రత్యేక స్థానం సంపాదించాడు.

నార్వే చెస్ పాయింట్ల పట్టికలో ప్రజ్ఞానంద 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అమెరికా ఆటగాడు వెస్లీ సో 17 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకోగా, ఫ్రాన్స్‌కు చెంది న అలీరెజా ఫిరౌజ్జా 15.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. మాగ్నస్ కార్ల్‌సన్ 13 పాయింట్లతో టోర్నీని ము గించగా, డి గుకేశ్ 8 పాయింట్లతో వెనుకబడ్డాడు.

ఈ విజయం ప్రజ్ఞానంద కెరీర్‌లోనే కాకుండా భారత చెస్ అభివృద్ధిలో కూడా కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఇప్పటికే కాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించిన 20 ఏళ్ల ఈ యువ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ అత్యుత్తమ చెస్ ఆటగాళ్ల సరసన తన స్థానాన్ని మరింత బలపరిచాడు. కష్టకాలాన్ని అధిగమించి టైటిల్ గెలవడం అతడి పట్టుదల, మానసిక దృఢత్వానికి నిదర్శనంగా నిలిచింది.

Related Articles

Back to top button